హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన OnePlus 6T లాంచ్ ఈవెంట్ వోచర్స్

OnePlus 6T విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన లాంచ్ ఈవెంట్ వోచర్స్ oneplus.inలో హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

|

OnePlus 6T విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన లాంచ్ ఈవెంట్ వోచర్స్ oneplus.inలో హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ వోచర్స్ దొరకకపోవటంతో నిరుత్సహానికి గురైన పలువరు వన్‌ప్లస్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్, న్యూఢిలీ వేదికగా అక్టోబర్ 30, 2018న ఏర్పాటు చేసిన స్పెషల్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా వన్‌ప్లస్ 6టీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది.

సేల్ ప్రారంభమైన కొద్ది సేపటికే..

సేల్ ప్రారంభమైన కొద్ది సేపటికే..

ఈ కార్యక్రమానికి హాజరయ్యే అభిమానులకు అక్కడ ఏర్పాటు చేసే ఎక్స్‌పీరియన్స్ జోన్‌లో ఫోన్‌ను చేతితో పట్టుకుని చూడటంతో పాటు డివైస్ పనితీరను విశ్లేషించే వీలుంటుంది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యే ఫ్యాన్స్‌కు వన్‌ప్లస్ బుల్లెట్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్స్, వన్‌ప్లస్ పిన్ సెట్, వన్‌ప్లస్ స్కెచ్‌బాక్స్ ఇంకా వన్ ప్లస్ మర్చండైస్‌లతో కూడిన గిఫ్ట్ లభిస్తుంది.

 

వన్‌ప్లస్ 6టీ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి వోచర్స్‌

వన్‌ప్లస్ 6టీ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి వోచర్స్‌

ఈ కార్యక్రమానికి హాజరవ్వాలనుకునే యూజర్లు ముందుగా రూ.999 పెట్టి వోచర్‌ను కొనుగోలు చేయవల్సి ఉంది. వన్‌ప్లస్ 6టీ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి వోచర్స్‌ను ఆ సంస్థ గురువారం ఉదయం 10 గంటలకు తన అఫీషియల్ వెబ్‌సైట్ అయిన oneplus.inలో అమ్మకానికి ఉంచింది. సేల్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈ వోచర్స్ అన్ని అమ్ముడుపోయాయి.

 

 

ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ, Android Pie అవుట్-ఆఫ్-బాక్స్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది. ఈ అప్‌డేట్‌ను ఆక్సిజన్ ఓఎస్ స్కిన్‌తో వన్‌ప్లస్ అందించబోతోంది. ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టంతో భారత్‌లో లాంచ్ కాబోతోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ 6టీ చరిత్రసృష్టించబోతోంది.ఈ లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంకు అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫీచర్ ఫోన్‌లోని అప్లికేషన్‌లను నిరంతరం మానిటర్ చేస్తూ అవసరమైన బ్యాటరీ పవర్‌ను మాత్రమే అవి ఉపయోగించుకునేలా చూస్తుంది. Android Pie అప్‌డేట్‌తో కూడిన ఆక్సిజన్ ఓఎస్ 9.0 స్కిన్ వన్‌ప్లస్ 6కు కూడా లభించబోతోంది.

వేగవంతమైన డాష్ ఛార్జింగ్

వేగవంతమైన డాష్ ఛార్జింగ్

వన్‌ప్లస్ 6తో పోలిస్తే వన్‌ప్లస్ 6టీ పెద్దదైనా ఇంకా శక్తివంతమైన బ్యాటరీతో రాబోతోంది. ఇదే సమయంలో డాష్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మరింతగా అప్‌డేట్ చేసినట్లు స్పష్టమవుతోంది. బ్యాటరీ పనితీరు విషయంలో ఇప్పటికే మంచి రెప్యుటేషన్‌ను సొంతం చేసుకున్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు భవిష్యత్‌లోనూ ఇదే విధమైన ట్రెండ్ ను కొనసాగిస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

 

ఫ్యూచరిస్టిక్ స్క్రీన్  అన్‌లాక్ ఫీచర్‌

ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ ఫీచర్‌

వన్‌ప్లస్ తన లేటెస్ట్ 6టీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ ఇంకా ఫౌండర్ Pete Lau అఫీషియల్ కన్ఫర్మ్ చేసారు. ఈ ఫీచర్‌కు సంబంధించి ఓ టీజర్‌ను కూడా వన్‌ప్లస్ విడుదల చేసింది. ఈ 5 సెకన్ల వీడియోలో ఫోన్‌లోని ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా మరింత లోతుగా రివీల్ చేసే ప్రయత్నం చేసారు. వన్‌ప్లస్ తన ఫ్యూచరిస్టిక్ స్ర్కీన్ అన్‌లాక్ టెక్నాలజీ పై అనేక నెలలపాటు శ్రమించింది. దీంతో ఫోన్ అన్‌లాక్ సమయాన్ని మిల్లీ సెకన్లలోకి తీసుకురాగలిగింది.

 

 

భద్రతకు పెద్దపీట...

భద్రతకు పెద్దపీట...

వన్‌ప్లస్ తన 6టీ ద్వారా ప్రపంచానికి పరిచయం కాబోతోన్న ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ రెగ్యులర్ బయోమెట్రిక్ స్కానర్స్‌తో పోలిస్తే మరింత అప్‌డేటెడ్‌గా ఉండటంతో పాటు మరింత యూక్యురేట్‌గా స్పందించగలుగుతుందట. ఈ టెక్నాలజీ ఒక సింగిల్ మాడ్యుల్‌గానే కాకుండా ఫోన్‌లోని ఇతర విభాగాలను కలపుకుని ముందుకు సాగుతుందట. యూజర్‌కు సంబంధించిన ఫింగర్ ప్రింట్ సమాచారాన్ని స్టోర్ చేసే క్రమంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్‌లోని ‘Trust Zone' అనే డెడికేటెడ్ సాంకేతికతను వన్‌ప్లస్ ఇంజినీర్లు ఉపయోగించినట్లు తెలిసింది. ఈ ట్రస్ట్ జోన్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వర్చువల్ స్పేస్ యూజర్ ఫింగర్ ప్రింట్ డేటాకు పూర్తిస్థాయి భద్రతను కల్పిస్తుంది. యూజర్ వన్‌ప్లస్ 6టీ డిస్‌ప్లే పై చేతి వేలును ఉంచిన వెంటనే సెన్సార్స్ ఆ డేటాను రికార్డ్ చేసి అప్పటికే ట్రస్ట్ జోన్‌లో రికార్డ్ అయి ఉన్న డేటాతో పోల్చి చూస్తాయి. ఆ రెండు డేటాలు మ్యాచ్ అయితేనే అన్‌లాక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది.

 

 

Best Mobiles in India

English summary
OnePlus 6T launch event vouchers sold out within seconds of going live.To Know More About Visit telugu.gizbot.com
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X