ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న OnePlus 6T McLaren edition

చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ OnePlus 6Tని నవంబర్ లో లాంచ్ చేసిన సంగతి విదితమే.

|

చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ OnePlus 6Tని నవంబర్ లో లాంచ్ చేసిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో కంపెనీ ఈ ఫోన్ ని సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే OnePlus 6T McLaren editionని ఈ రోజు ఇండియా మార్కెట్లో విడుదల చేయబోతుంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6:00PM కు ముంబైలో జరగనుంది.

క్రేజీ కలర్ వేరియంట్‌లో వివో వీ11 ప్రో, లాంచ్ ఆఫర్స్ ఇవే!క్రేజీ కలర్ వేరియంట్‌లో వివో వీ11 ప్రో, లాంచ్ ఆఫర్స్ ఇవే!

OnePlus 6T McLaren edition....

OnePlus 6T McLaren edition....

ఇప్పుడు మరో సంలచనంతో దూసుకువస్తోంది. OnePlus 6T McLaren editionని విడుదల చేసి మార్కెట్లో ఆధిపత్యాన్ని చెలాయించాలని రెడీ అయింది. ఈ ఫోన్ 10 జిబి ర్యామ్ అలాగే 256 జిబి స్టోరేజ్ తో రానుంది.ఈ ఫోన్ ధర సుమారు రూ.50,000గా ఉండవచ్చు అని అంచనా.

OnePlus 6T McLaren గేమింగ్ ఫోన్...

OnePlus 6T McLaren గేమింగ్ ఫోన్...

కాగా రానున్న వన్‌ప్లస్ 6టి McLaren గేమింగ్ ఫోన్ గా అందుబాటులోకి రానుంది. ఫార్ములా వన్ హిస్టరి ని మార్కెటింగ్ చేసే దిశలో భాగంగా సెల్యూట్ స్పీడ్ పేరుతో ఈ ఫోన్ ని తీసుకొని రానుంది.

గత ఏడాది వన్ ప్లస్ కంపెనీ...

గత ఏడాది వన్ ప్లస్ కంపెనీ...

కాగా గత ఏడాది వన్ ప్లస్ కంపెనీ 20వ యానివర్సరీలో భాగంగా పర్సియన్ రీటెయిలర్ Colette భాగస్వామ్యంతో వన్ ప్లస్ 3టిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కంపెనీ Jean-Charles de Castelbajacతో కలిసి త్వరలో మరొక ఫోన్ OnePlus 5 JCC+Limited Editionని మార్కెట్లోకి తీసుకరాబోతోంది.

OnePlus 6 Marvel Avengers Limited Edition....

OnePlus 6 Marvel Avengers Limited Edition....

ఇదిలా ఉంటే మార్వెల్ స్టూడియోతో కలిసి గతేడాది యానివర్సరీ సేల్ లో భాగంగా OnePlus 6 Marvel Avengers Limited Edition తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా OnePlus 5T Star Wars Limited Editionని కూడా మార్కెట్లోకి తీసుకువచ్చింది.

Oneplus 6T ఫీచర్లు....

Oneplus 6T ఫీచర్లు....

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
OnePlus 6T McLaren Edition India Launch Set for Today.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X