డిసెంబర్ 12న వన్‌ప్లస్ 6టి McLaren ఎడిషన్ విడుదల
చైనా మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ 6టి మార్కెట్లో సంచలనం రేపుతోంది. ఈ ఫోన్ అమ్మకాలు భారీగా దూసుకెళుతున్నాయి.
చైనా మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ 6టి మార్కెట్లో సంచలనం రేపుతోంది. ఈ ఫోన్ అమ్మకాలు భారీగా దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ ఫోన్ ని సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే OnePlus 6T McLaren editionని తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఫోన్ డిసెంబర్ 12న మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. కాగా కంపెనీ ఇప్పటికే OnePlus 6T Thunder Purple editionని మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. దీని ధర రూ. 41,999గా ఉంది. ఈ ఫోన్ ధర వన్ ప్లస్ 6టి 8జిబి ర్యామ్ ధరకు సమానంగానే ఉంది.

వన్‌ప్లస్ 6టి McLaren గేమింగ్ ఫోన్...
కాగా రానున్న వన్‌ప్లస్ 6టి McLaren గేమింగ్ ఫోన్ గా అందుబాటులోకి రానుంది. ఫార్ములా వన్ హిస్టరి ని మార్కెటింగ్ చేసే దిశలో భాగంగా సెల్యూట్ స్పీడ్ పేరుతో ఈ ఫోన్ ని తీసుకురానుందని సమాచారం. టాప్ ఎండ్ ఫీచర్లు అలాగే ధరతో రానున్న ఈ ఫోన్ గతంలో మాదిరిగానే 8జిబి ర్యామ్ తో రానుంది. అయితే ధర విషయంలో పాత ఫోన్ల కన్నా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది వన్ ప్లస్ కంపెనీ
కాగా గత ఏడాది వన్ ప్లస్ కంపెనీ 20వ యానివర్సరీలో భాగంగా పర్సియన్ రీటెయిలర్ Colette భాగస్వామ్యంతో వన్ ప్లస్ 3టిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కంపెనీ Jean-Charles de Castelbajacతో కలిసి త్వరలో మరొక ఫోన్ OnePlus 5 JCC+Limited Editionని మార్కెట్లోకి తీసుకరాబోతోంది.

OnePlus 6 Marvel Avengers Limited Edition....
ఇదిలా ఉంటే మార్వెల్ స్టూడియోతో కలిసి గతేడాది యానివర్సరీ సేల్ లో భాగంగా OnePlus 6 Marvel Avengers Limited Edition తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా OnePlus 5T Star Wars Limited Editionని కూడా మార్కెట్లోకి తీసుకువచ్చింది.

OnePlus 6T McLaren edition....
ఇప్పుడు మరో సంలచనంతో దూసుకువస్తోంది. OnePlus 6T McLaren editionని విడుదల చేసి మార్కెట్లో ఆధిపత్యాన్ని చెలాయించాలని రెడీ అయింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ అలాగే 128 జిబి స్టోరేజ్ తో రానందని సమాచారం. దీని ధర రూ.41,999గా ఉండనుంది. గతంలో వచ్చిన వన్ ప్లస్ 6టీ ఫోన్ ఫీచర్లే ఇందులో ఉండనున్నాయి. కొంచెం మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు డిసెంబర్ 12న తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications