OnePlus 6T మెక్‌లారెన్ ఎడిషన్ విడుదల, 10 విషయాలు మీకోసం
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌కు గాను వన్‌ప్లస్ 6టి మెక్‌లారెన్ ఎడిషన్‌ను ఇండియాలో విడుదల చేసింది.
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌కు గాను వన్‌ప్లస్ 6టి మెక్‌లారెన్ ఎడిషన్‌ను ఇండియాలో విడుదల చేసింది.McLaren Racing Limited పార్టనర్ గా వన్‌ప్లస్ ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ఈ కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్ ద్వారా, OnePlus online stores ద్వారా డిసెంబర్ 15 నుంచి అమ్మకానికి వెళ్లనుంది. కాగా గతంలో వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ ఎడిషన్‌ను కూడా వన్‌ప్లస్ లాంచ్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వన్‌ప్లస్ 6టి మెక్‌లారెన్ ఎడిషన్‌ను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ సంధర్భంగా ఈ ఫోన్ గురించి ఓ 10 విషయాలు మీకోసం,..

ధర
OnePlus 6T మెక్‌లారెన్ ఎడిషన్ ధరను ఇండియాలో కంపెనీ రూ. 50,999గా నిర్ణయించింది. కాగా వన్‌ప్లస్ కంపెనీ నుంచి వచ్చిన అతి పెద్ద ర్యామ్ ఫోన్ కూడా ఇదే.

డిజైన్
ఈ డివైస్ signature McLaren colour, Papaya Orange races రంగుల్లో లభ్యమవుతోంది. McLaren's carbon fiber technologyతో అత్యంత ఆకర్షణీయంగా ఈ ఫోన్ ని డిజైన్ చేశారు. ఫోన్ వెనుక భాగంలో McLaren branding ఉంటుంది.

ర్యామ్, ప్రాసెసర్
కాగా ఈ ఫోన్ 10 జిబి ర్యామ్ , క్వాల్ కామ్ సపోర్ట్, Snapdragon 845 processor వంటి స్పెషల్ ఫీచర్లతో వచ్చింది.

OnePlus 6T కన్నా బెటర్
కాగా ఈ డివైస్ OnePlus 6T 8GB/256GB వర్షన్ కన్నా బెటర్ ఫెర్మార్మెన్స్ ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అదనంగా కొన్ని ఫీచర్లను కూడా జోడించారు.

స్టోరేజ్
ఈ ఫోన్ 10 జిబితో పాటు 256 జిబితో అందుబాటలోకి వచ్చింది. దీన్ని కేవలం 256 జిబి స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే తీసుకువచ్చారు.ఇతర వేరియంట్లు అందుబాటులో లేవు.

ఛార్జింగ్
ఈ డివైస్ అధునాతన ఛార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. ఇందులో లేటెస్ట్ Warp Charge 30 charging టెక్నాలజీని వాడారు. ఇది కేవలం McLaren Edition ఎడిషన్ లో మాత్రమే ఉంది. ఇతర వేరియంట్లలో అందుబాటులో లేదు.

UI with dark mode
ఈ ఫోన్ UI with dark mode లాంటి లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.

fibre design-based hard case
ఈ ఫోన్ ద్వారా కొనుగోలుదారులు McLaren branded hard caseని ఉచితంగా పొందవచ్చు.

గేమ్ బూస్ట్
గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా కంపెనీ వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది.

డిసెంబర్ 15 నుంచి అమ్మకాలు
ఈ ఫోన్ ఈ కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్ ద్వారా, OnePlus online stores ద్వారా డిసెంబర్ 15 నుంచి అమ్మకానికి వెళ్లనుంది.


Click it and Unblock the Notifications








