అడ్వాన్సుడ్ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీతో OnePlus 6T
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్రాండ్ తదుపరి వెంచర్ అయిన వన్‌ప్లస్ 6టీ (OnePlus 6T) ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్రాండ్ తదుపరి వెంచర్ అయిన వన్‌ప్లస్ 6టీ (OnePlus 6T) ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ అప్‌కమ్మింగ్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గంటకో న్యూస్ వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 2018 చివరి నాటికి మార్కెట్లో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పలు టాప్ రూమార్స్‌ను కొద్ది గంటల క్రితమే మీకందించటం జరిగింది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా వన్‌ప్లస్ 6టీకి సంబంధించి కొన్ని వాస్తవాలతో పాటు కొంత అఫీషియల్ న్యూస్‌ను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్..
బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన బ్యాటరీ యూనిట్‌తో రాబోతోందట. పవర్‌హౌస్‌గా అభివర్ణించబడుతోన్నఈ బ్యాటరీ యూనిట్ ఫుల్ ఛార్జ్ పై రోజు మొత్తం సరిపోయే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుందట. వన్‌ప్లస్ 6టీ బ్యాటరీ కెపాసిటీకి సంబంధించి ఖచ్చితమైన డిటెయిల్స్‌ను వన్‌ప్లస్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు.

టైప్-సీ జాక్‌తో వన్‌ప్లస్ బుల్లెట్ ఇయర్ ఫోన్స్
ఆడియో ప్రియులను దృష్టిలో ఉంచుకుని వన్‌ప్లస్, తన వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా సరికొత్త బుల్లెట్ ఇయర్ ఫోన్స్‌ను అందించబోతోంది. ఈ ఇయర్ ఫోన్స్ టైప్-సీ జాక్‌తో అందుబాటులో ఉండబోతున్నాయట. ఈ కొత్త హెడ్‌ఫోన్స్‌లో ఫెర్ఫామెన్స్, బ్యాటరీలైఫ్ ఇంకా సోనిక్ సిగ్నేచర్ పరంగా భారీ మార్పుచేర్పులు ఉండబోతున్నాయని సమాచారం. వన్‌ప్లస్ ఫోన్‌లలో ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను మరింత విప్లవాత్మక చేసే ఉద్దేశ్యంతో 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ సంస్కృతికి పూర్తిగా స్వస్తి పలికిన విషయం తెలిసిందే.

వన్‌ప్లస్ - గూగుల్ ఎక్స్‌క్లూజివ్ పార్టనర్‌షిప్
వన్‌ప్లస్ తన అప్‌కమ్మింగ్ ప్రాజెక్టుకు సంబంధించి సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ పార్టనర్‌షిప్‌కు సంబంధించిన బిగ్ న్యూస్‌ను వన్‌ప్లస్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌లో "Think you have what it takes to crack the code? Play #Crackables to find out. Starting September 18." అంటూ కొంత టెక్ట్స్‌తో పాటు గేమింగ్ యానిమేషన్ క్యారెక్టర్‌తో కూడిన వీడియోను కూడా వన్‌ప్లస్ పోస్ట్ చేసింది. దీని బట్టి చూస్తుంటే గూగుల్ భాగస్వామ్యంతో ఓ ఎక్స్‌క్లూజవ్ పజిల్ గేమ్‌ను వన్‌ప్లస్ 6టీ యూజర్స్ కోసం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

విప్లవాత్మక ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ..
వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ ద్వారా విప్లవాత్మక బయోమెట్రిక్ సెన్సింగ్ టెక్నాలజీని అందించబోతోంది. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ Screen Unlock పేరుతో యూజర్లకు అందుబాటులో ఉంటుందట. ఈ స్కానింగ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేదాని పై కంపెనీ ఇప్పటి వరకు స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు. అయితే, అనధికారికంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఈ టెక్నాలజీ మరింత వేగంగా స్పందించటంతో పాటు డివైస్‌లోని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను సెక్యూర్ చేయగలుగుతుందట.

మెరుగైనా ఇంకా పెద్దదైన డిస్‌ప్లే..
హైక్వాలిటీ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేసే క్రమంలో వన్‌ప్లస్, తన వన్‌ప్లస్ 6టీ డివైస్‌ను పూర్తిస్థాయి బీజిల్ - లెస్ అమోల్డ్ డిస్‌ప్లేతో అందించబోతోందట. ఈ ఫోన్ డిస్‌ప్లే పై నాట్చ్ అనేది చాలా చిన్నగా ఉండటంతో వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ యూజర్లకు కొత్త లెవల్‌కు తీసుకువెళ్లబోతోందట.

వేగవంతమైన డ్యాష్ ఛార్జింగ్..
డ్యాష్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించటంలో ఇప్పటికే నెం.1 సంస్థగా గుర్తింపుతెచ్చుకున్న వన్‌ప్లస్, తన వన్‌ప్లస్ 6టీ డివైస్‌తో మరింత ఆధునీకతతో కూడిన డ్యాష్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించబోతోందట. ముఖ్యంగా పెద్ద బ్యాటరీతో వస్తోన్న ఈ డివైస్‌ను వేగవంతంగా ఛార్జ్ చేసేందుకు ఈ టెక్నాలజీ దోహదపడనుందట.

ట్రిపుల్ - లెన్స్ రేర్ కెమెరా సెటప్
కెమెరా విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ మోడల్‌లో మోస్ట్ అడ్వాన్సుడ్ స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది. అన్‌అఫీషియల్‌గా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో పాప్-అప్ కెమెరా మెకనిజంతో పాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను ఎక్విప్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఫోన్ డీఎస్ఎల్ఆర్ తరహాతో ఇన్-డెప్త్ సెన్సింగ్‌తో హై-క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేయనుందట.


Click it and Unblock the Notifications








