OnePlus 6T గురించి మరో షాకింగ్ న్యూస్..

వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గతకొద్ది నెలలుగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న లీక్స్ అలానే రూమర్స్‌కు తెరదించుతూ ఆ కంపెనీ సీఈఓ ఇంకా ఫౌండర్ Pete Lau ఆసక్తికర వివరాలను రివీల్ చేసారు.

|

వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గతకొద్ది నెలలుగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న లీక్స్ అలానే రూమర్స్‌కు తెరదించుతూ ఆ కంపెనీ సీఈఓ ఇంకా ఫౌండర్ Pete Lau ఆసక్తికర వివరాలను రివీల్ చేసారు. ఈయన వెల్లడించిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 6టీ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సపోర్టుతో రాబోతోంది. ఈ విప్లవాత్మక స్కానర్ వ్యవస్థ వేగవంతమైన ఇన్-డిస్‌ప్లే అన్‌లాక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయగలుగుతుందట.

 

ఫ్యూచరిస్టిక్ స్క్రీన్  అన్‌లాక్ టెక్నాలజీతో..

ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ టెక్నాలజీతో..

తన ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ టెక్నాలజీ గురించి ఓ టీజర్‌ను కూడా వన్‌ప్లస్ లాంచ్ చేసింది. ఈ 5 సెకన్ల వీడియోలో వన్‌ప్లస్ 6టీ డివైస్‌ అత్యంత పలుచటి బీజిల్స్‌తో కనిపిస్తోంది. ఇదే సమయంలో ఫోన్‌లోని ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా మరింత లోతుగా రివీల్ చేసే ప్రయత్నం చేసారు. వన్‌ప్లస్ తన ఫ్యూచరిస్టిక్ స్ర్కీన్ అన్‌లాక్ టెక్నాలజీ పై అనేక నెలలపాటు శ్రమించింది. దీంతో ఫోన్ అన్‌లాక్ సమయాన్ని మిల్లీ సెకన్లలోకి తీసుకురాగలిగింది.

మొదటి నుంచి క్రియేటివ్ మైండ్‌సెట్‌తోనే..

మొదటి నుంచి క్రియేటివ్ మైండ్‌సెట్‌తోనే..

తొలి నుంచి క్రియేటివ్ మైండ్‌సెట్‌తో దూసుకువెళుతోన్న వన్‌ప్లస్ తన యూజర్లకు నిత్యం సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేసే ప్రయత్నం చేస్తుంది. వన్‌ప్లస్ తన 6టీ మోడల్‌తో పరిచయం చేయబోతోన్న ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ టెక్నాలజీ రెగ్యులర్ బయోమెట్రిక్ స్కానర్స్‌తో పోలిస్తే మరింత అప్‌డేటెడ్‌గా ఉంటుంది. 6టీ డివైస్‌లోని స్ర్కీన్ అన్‌లాక్ కేవలం ఒక మాడ్యుల్ మాత్రమే కాదు, ఈ టెక్నాలజీ ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ కాంపోనెంట్‌లను కలుపుకుని ముందుకు సాగుతుంది.

 

 

ఫింగర్ ప్రింట్‌ను యాక్యురేట్‌గా రీడ్ చేసేందుకుగాను..
 

ఫింగర్ ప్రింట్‌ను యాక్యురేట్‌గా రీడ్ చేసేందుకుగాను..

ఈ టెక్నాలజీ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ మాడ్యుల్ పై వర్క్ అవుతుంది. ఇందులో యూజర్ ఫింగర్ ప్రింట్‌ను యాక్యురేట్‌గా రీడ్ చేసి రిజిస్టర్ చేసేందుకు గాను చిన్న లెన్స్‌ను ఏర్పాటు చేసారు. యూజర్ ఫింగర్ ప్రింట్‌కు సంబంధించిన అవుట్ లైన్‌ను మరింతగా ఎన్‌హాన్స్ చేసే క్రమంలో లైట్ సోర్సును వన్‌ప్లస్ 6టీ ఉపయోగించుకుంటుంది.

 

 

‘Trust Zone'తో మరింత గోప్యత..

‘Trust Zone'తో మరింత గోప్యత..

వన్‌ప్లస్ తన 6టీ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించిన హార్డ్‌వేర్‌కు సెల్ఫ్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్‌ను కంభైన్ చేయటంతో పాటు ఫింగర్ ప్రింట్ సమాచారం మిల్లీ సెకన్లలో ప్రీ-లోడ్ కాబడి వేగవంతమైన ఇన్-డిస్‌ప్లే అన్‌లాక్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్‌కు ప్రొవైడ్ చేస్తుంది. యూజర్‌కు సంబంధించిన ఫింగర్ ప్రింట్ సమాచారాన్ని స్టోర్ చేసే క్రమంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్‌లోని ‘Trust Zone' అనే డెడికేటెడ్ సాంకేతికతను వన్‌ప్లస్ ఇంజినీర్లు ఉపయోగించినట్లు తెలిసింది.

 

 

భారీ అంచనాలే ఉన్నాయి..

భారీ అంచనాలే ఉన్నాయి..

ఈ ట్రస్ట్ జోన్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వర్చువల్ స్పేస్ యూజర్ ఫింగర్ ప్రింట్ డేటాకు పూర్తిస్థాయి భద్రతను కల్పిస్తుంది. యూజర్ వన్‌ప్లస్ 6టీ డిస్‌ప్లే పై చేతి వేలును ఉంచిన వెంటనే సెన్సార్స్ ఆ డేటాను రికార్డ్ చేసి అప్పటికే ట్రస్ట్ జోన్‌లో రికార్డ్ అయి ఉన్న డేటాతో పోల్చి చూస్తాయి. ఆ రెండు డేటాలు మ్యాచ్ అయితేనే అన్‌లాక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వన్‌ప్లస్ 6టీ అఫీషియల్ లాంచ్‌కు ఇంకా కొద్ది వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ఫోన్ అందించబోతోన్న ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ టెక్నాలజీ పై భారీ అంచనాలు నెలకున్నాయి.

తొలత 5టీ డివైస్‌లో టెస్ట్ చేసింది...

తొలత 5టీ డివైస్‌లో టెస్ట్ చేసింది...

వన్‌ప్లస్ తన విప్లవాత్మక ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని తొలత 5టీ డివైస్‌లో టెస్ట్ చేసింది. ఈ డివైస్‌లో ఉపయోగించిన మొదటి జనరేషన్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ మాడ్యుల్ యూజర్లను అంతగా ఆకట్టుకోలేకే పోయింది. దీంతో ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్న వన్‌ప్లస్ టీమ్ అనేక నెలలుగా పరిశోధనలు జరిపి అంతిమంగా ఫైనల్ వెర్షన్ స్ర్కీన్ అన్‌లాక్ టెక్నాలజీ విజయవంతగా పరీక్షించ గలిగింది. ఈ వెర్షన్ మంచి ఫలితాలను ఇస్తుండటంతో వన్‌ప్లస్ 6టీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

 

 

ప్రమాదాలను తట్టుకునే సామర్థ్యం...

ప్రమాదాలను తట్టుకునే సామర్థ్యం...

వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బాడీ బిల్డ్ విషయంలోనూ సంస్థ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ డ్యూరబులిటీకి సంబంధించి కంపెనీ సీఈవో Pete Lau పలు ఆసక్తికర వివరాలను రివీల్ చేసారు. గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ డివైస్‌లతో పోలిస్తే వన్‌ప్లస్ 6 మరింత మెరుగైన వాటర్ రిసెస్టింట్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని, ఇదే సమయంలో ప్రమాదాలను కూడా ఈ ఫోన్ తట్టుకోగలదని Cnet.comకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన వెల్లడించారు. అక్టోబర్ మూడవ వారంలో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న వన్‌ప్లస్ 6టీ డివైస్‌ను భారత్‌లో అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

Best Mobiles in India

English summary
OnePlus 6T Screen Unlock will forever change the way you interact with your phone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X