వన్ ప్లస్ 6t మరో సంచలనం సృష్టించబోతుందా..?

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఏదైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అవుతుందంటే చాలు, దాని హంగామా వేరుగా ఉంటుంది.

|

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఏదైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అవుతుందంటే చాలు, దాని హంగామా వేరుగా ఉంటుంది. సరిగ్గా అటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా నెలుకుంది.ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లవర్స్ అంతా ఈ వన్ ప్లస్ 6t మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వన్ ప్లస్ 6t ఫోన్ విడుదల తేదీ గురించి వన్ ప్లస్ సంస్థ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టింది. ఈ ఫోన్ అక్టోబర్ లాస్ట్ లో మార్కెట్లోకి రాబోతునట్టు తెలిపింది.ప్రస్తుతం వన్ ప్లస్ 6t కోసం 'నోటిఫై మి' ను ఇప్పటికే Amazon.in ప్రత్యక్షంగా పోయింది, ఇందులో వినియోగదారులు వన్ ప్లస్ 6t రెగ్యులర్ అప్ డేట్స్ కోసం సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.

 

మార్కెటింగ్‌లోనూ  అవుట్- ఆఫ్-ద-బాక్స్

మార్కెటింగ్‌లోనూ అవుట్- ఆఫ్-ద-బాక్స్

ఈ ఫోన్ యాడ్ కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించడంతో ఈ ఫోన్ కు మరింత పాపులారిటీ పెరిగిపోయింది.వన్ ప్లస్ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ యాడ్ లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ గురించి చూయించాడు .దీని ప్రకారం వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌‌కు సంబంధించిన సెక్యూరిటీ విభాగాలను మరింత విప్లవాత్మకంగా వన్‌ప్లస్ తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన ఫ్యూచరిస్టిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ ఫోన్ పనితీరునే పూర్తి మార్చివేయబోతోంది .

త్వరలో రాబోతున్న మరో యాడ్

త్వరలో రాబోతున్న మరో యాడ్

వన్‌ప్లస్ 6టీ లాంచ్ కి దగ్గర పడటంతో వన్ ప్లస్ సంస్థ ఈ ఫోన్ యొక్క అంచనాలను మరింత పెంచేలా చూస్తుంది. దాని కోసమై మరో యాడ్ ను షూట్ చేస్తుంది .ఈ యాడ్ త్వరలో టీవీ లో ప్రసారం కాబోతుంది.

హాట్ స్టార్ లో వన్‌ప్లస్ 6టీ
 

హాట్ స్టార్ లో వన్‌ప్లస్ 6టీ

ఈ ఫోన్ యొక్క యాడ్ ను టీ వీ మరియు హాట్ స్టార్ రెండింటిలోనూ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు ప్రసారం చేసింది. కొనసాగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఆనందించేటప్పుడు, మీరు ప్రతి బంతిని ఆట యొక్క అంచనాలను తయారు చేయగల Hotstar యాప్ పై కొత్త 6 టి చిహ్నాన్ని చూడగలుగుతారు.

పవర్ - ప్యాకెడ్ బ్యాటరీ

పవర్ - ప్యాకెడ్ బ్యాటరీ

వన్‌ప్లస్ బ్రాండ్ తన డ్యాష్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా ఇండస్ట్రీ బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో, త్వరలో లాంచ్ చేయబోతోన్నవన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌‌లోనూ ఇదే తరహా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వన్‌ప్లస్ నిక్షిప్తం చేసే అవకాశం ఉంది. రూమర్స్ మిల్స్ రివీల్ చేసిన వివరాల ప్రకారం 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.

ట్రిపుల్-లెన్స్ రేర్ కెమెరా సెట్ అప్

ట్రిపుల్-లెన్స్ రేర్ కెమెరా సెట్ అప్

కెమెరా విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ మోడల్‌లో ఒప్పో, వివో తరహాలోనే పాప్-అప్ కెమెరా మెకనిజంను ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇదే సమయంలో ట్రిపుల్ రేర్ కెమెరా సపోర్టుతో ఈ ఫోన్ లభించే అవకాశం ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి మెరుగుపరచబడిన సోనీ సెన్సార్‌తో కూడిన 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూనిట్‌లు డివైస్‌లో నిక్షిప్తం చేసే అవకాశముందని తెలుస్తోంది.

 

 

Best Mobiles in India

English summary
OnePlus 6T to take the center stage soon: Here's what to look out for.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X