త్వరలో ఇండియా మార్కెట్లోకి రానున్న వన్‌ప్లస్ 6T థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్‌

చైనా మొబైల్ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6Tని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

|

చైనా మొబైల్ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6Tని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ ఫోన్‌కు చెందిన థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్‌ చైనాలో మాత్రమే విడుదల అయింది.ఈ నేపథ్యంలో త్వరలో భారత్‌లోనూ వినియోగదారులకు ఈ ఫోన్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే మిడ్‌నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్ వేరియెంట్లలో వన్‌ప్లస్ 6T ఫోన్ లభిస్తుండగా, వాటి సరసన ఈ కొత్త కలర్ వేరియెంట్ వచ్చి చేరింది. ఇక ఫీచర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. వన్‌ప్లస్ 6T ఇతర కలర్ వేరియెంట్లలో ఉన్న ఫీచర్లే ఈ కొత్త కలర్ వేరియెంట్‌లోనూ లభిస్తున్నాయి.

 

వాట్సాప్ నుంచి మరో అద్భుత ఫీచర్వాట్సాప్ నుంచి మరో అద్భుత ఫీచర్

ధర...

ధర...

వన్‌ప్లస్ 6T థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లో మాత్రమే లభిస్తున్నది. దీని ధర రూ.40,000 పైగా ఉండొచ్చు అని అంచనా . అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 గా నిర్ణయించింది, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999 గా ఉంది.

 

 

నవంబర్ 30 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది....

నవంబర్ 30 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది....

ఈ ఫోన్ నవంబర్ 30 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు లాంచ్ అయిన వన్‌ప్లస్ 6T దిగ్గజాలకు సవాల్ విసరనుంది. హానర్ ఫోన్లకు అలాగే శాంసంగ్, ఆపిల్ ఐఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

ఫీచర్లు...
 

ఫీచర్లు...

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
OnePlus 6T Thunder Purple Colour Variant to Launch in India Soon.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X