Home
Mobile

కేక పుట్టిస్తోన్న వన్‌ప్లస్ 6T థండర్ పర్పుల్ ఎడిషన్

చైనా మొబైల్ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6Tని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

చైనా మొబైల్ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6Tని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ ఫోన్ మార్కెట్లో విడుదల అయినప్పటినుంచి రికార్డు లెవెల్ లో సేల్స్ ను కొల్లగొడుతుంది.సరసమైన ధరలో అదునాతనమైన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది. ఈ ఫోన్ ఇంతటి క్రేజ్ పొందడానికి ముఖ్య కారణం స్పెషల్ ఫీచర్స్ తో పాటు దాని ఆ ఫోన్ యొక్క కలర్ కూడా.అందుకే వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 6T ఫోన్ యొక్క కలర్స్ పై ముఖ్య శ్రద్ధ వహించింది.అయితే లాంచ్ సమయంలో వన్‌ప్లస్ 6T కేవలం మిడ్‌నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్ వేరియెంట్లలో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.ఇప్పుడు లేటెస్ట్ గా థండర్ పర్పుల్ ఎడిషన్ ను తీసుకొచ్చింది.

వన్‌ప్లస్ 6T ఫోన్ ను థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్‌లో....

వన్‌ప్లస్ 6T ఫోన్ ను థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్‌లో....

అయితే ఇప్పుడు వన్‌ప్లస్ కంపెనీ స్పెషల్ గా వన్‌ప్లస్ 6T ఫోన్ ను థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్‌లో మార్కెట్లోకి విడుదల చేసింది. వన్‌ప్లస్ కంపెనీ లో పనిచేసే డిజైన్ టీమ్ ఈ ఫోన్ ను చాలా సహజ రంగులో ఉండేలా డిజైన్ చేసింది. వన్‌ప్లస్ కంపెనీ టీమ్ ప్రకారం ఈ ఫోన్ యొక్క కలర్ ను ను ఆకాశంలో కనిపించే .సహజ కలర్స్ నుండి డిజైన్ ప్రేరణ తీసుకుంది.

డిజైనర్లు వన్‌ప్లస్ 6T యొక్క ఫ్రోస్టెడ్ బ్యాక్ ప్యానెల్ కోసం నలుపు నుండి పర్పుల్ కలర్ లో ఫేడ్ అయితే ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసారు.ఈ కలర్ వేసవి రాత్రి లో థండర్ స్టార్మ్ ను చూసినట్టు ఉంటుంది.ఫోన్ యొక్క రంగులతో కాంతి ఎలా సంకర్షణ చెందుతుందో పరీక్షించడానికి డిజైన్ బృందం విస్తృతంగా ప్రయోగించింది.

వన్‌ప్లస్ 6T ఫోన్ వెనుక వైపు S కర్వ్ షేప్....

వన్‌ప్లస్ 6T ఫోన్ వెనుక వైపు S కర్వ్ షేప్....

వన్‌ప్లస్ 6T ఫోన్ వెనుక వైపు S కర్వ్ షేప్ కనిపించే విధంగా డిజైన్ చేసారు. ఈ S కర్వ్ షేప్ ఫోన్ వెనుక భాగమును చాలా హైలైట్ చేస్తుంది.మీకు ఆర్ట్ మరియు డిజైన్ యొక్క టేస్ట్ ఉంటే మీకు ఈ ఫోన్ చూసిన వెంటనే మతి పోతుంది. ఈ కొత్త పర్పుల్ షేడ్ వేరియంట్ మట్టే ఫినిష్ తో వస్తుంది కదా అని బాధ పడాల్సిన అవసరం లేదు మీ ఫింగర్ ప్రింట్స్ మీ హ్యాండ్సెట్ మీద పడిన యొక్క లుక్ మరియు ఫీల్ ను ఏ మాత్రం మార్చలేదు.

వన్‌ప్లస్ 6T యొక్క  ప్రీమియం క్రాఫ్ట్స్ మ్యాన్ షిప్...

వన్‌ప్లస్ 6T యొక్క ప్రీమియం క్రాఫ్ట్స్ మ్యాన్ షిప్...

వన్‌ప్లస్ 6T యొక్క ప్రీమియం క్రాఫ్ట్స్ మ్యాన్ షిప్ గురించి ముక్యంగా చెప్పుకోవాలి . వన్‌ప్లస్ డిజైన్ బృందం ద్వారా వివరించిన దృష్టిని కేవలం నమ్మదగనిది. డిజైన్ ఇంజనీర్లు స్మార్ట్ ఫోన్ రూపకల్పనలో చాలా శ్రద్ధ తీసుకున్నారు.ఫోన్ ను డిజైన్ చేస్తున్నపుడు లైట్స్ పడగానే మెరిసే విధంగా ఉండేలా పర్ఫెక్ట్ లుక్ ను తీసుకొచ్చారు. అంతేకాకుండా వన్‌ప్లస్ టీం కూడా గ్లాస్,హేజ్ , రఫ్ నెస్ , గ్లోస్ , ట్రాన్స్పరెన్సీ మరియు రిఫ్లెక్టీవ్ క్వాలిటీస్ వంటి ఇతర ముఖ్యమైన రూపకల్పన అంశాలను పరిగణలోకి తీసుకుంది.

 

 

వన్‌ప్లస్ 6T ధర...

వన్‌ప్లస్ 6T ధర...

వన్‌ప్లస్ 6T థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లో మాత్రమే లభిస్తున్నది. దీని ధర రూ.41,999 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ Amazon.in, oneplus.in మరియు Croma outlets, Reliance Digital outlets మరియు అన్ని OnePlus ఎక్సక్లూజివ్ ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ 6T  ఫీచర్లు...

వన్‌ప్లస్ 6T ఫీచర్లు...

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
OnePlus 6T Thunder Purple Edition is simply a piece of art.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X