వన్‌ప్లస్ 7T ప్రో సేల్స్ మొదలు.... మైండ్ బ్లాక్ ఫీచర్స్

|

వన్‌ప్లస్ 7T ప్రో ఇప్పుడు ఇండియాలో అధికారికంగా విడుదల అయింది. ఇది మనం ఉహించిన దాని కన్న, మరియు టీజర్ల పుకార్ల ద్వారా వెలువడిన స్పెసిఫికేషన్ల కంటే మెరుగ్గా ఉంది. షెన్‌జెన్ ఆధారిత సంస్థ వన్‌ప్లస్ 7T ప్రోను అధికారికంగా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్‌గా లాంచ్ చేసింది. ఇది వన్‌ప్లస్ యొక్క సరికొత్త ఫోన్ వన్‌ప్లస్ 7 ప్రోకు అప్డేట్ వెర్షన్ గా వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా డిజైన్‌ను కలిగి ఉంటుంది మరియు ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేతో వస్తుంది.

 
OnePlus 7T Pro Sales Start Today in India: Price, Specifications and More

ధర వివరాలు

ఇండియాలో వన్‌ప్లస్ 7T ప్రోను కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ చేసారు. దీని ధర సుమారు 53,999 రూపాయలు. ఇది ఈ రోజు అంటే అక్టోబర్ 11 న మధ్యాహ్నం 12 గంటల నుండి ఇండియాలోని 8 ప్రధాన నగరాల్లోని వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ద్వారా లభిస్తుంది. అమెజాన్ ఇండియా మరియు వన్‌ప్లస్ రిటైల్ ద్వారా అక్టోబర్ 12 న మధ్యాహ్నం 12 గంటల నుండి ఓపెన్ సేల్స్ ప్రారంభమవుతాయి. వన్‌ప్లస్7T ప్రో కేవలం ఒకే ఒక హేజ్ బ్లూ కలర్ ఆప్షన్‌లో మాత్రమే వస్తుంది.

 
OnePlus 7T Pro Sales Start Today in India: Price, Specifications and More

లాంచ్ ఆఫర్స్

లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే వన్‌ప్లస్ 7T ప్రోను కొనుగోలుదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినచో రూ.3,000ల తక్షణ తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ ఇండియాలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై రూ.1,750 తగ్గింపు పొందవచ్చు. అలాగే అమెజాన్ ఇండియాలో ఇతర ప్రసిద్ధ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై రూ.1,500 తగ్గింపు కూడా పొందవచ్చు. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. అలాగే అమెజాన్ పే ద్వారా విమాన బుకింగ్‌లకు 3,000 రూపాయలు,చివరగా వన్‌ప్లస్ మ్యూజిక్ ఫెస్టివల్‌ టిక్కెట్ల కొనుగోలుకు 30 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు.

OnePlus 7T Pro Sales Start Today in India: Price, Specifications and More

స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 7T ప్రో యొక్క పూర్తి డిజైన్ వన్‌ప్లస్ 7 ప్రోకు సమానంగా ఉంటుంది. అదే పాప్-అప్ సెల్ఫీ కెమెరా, అదే AMOLED డిస్ప్లే మరియు అదే బరువు, కొలతలతో వస్తుంది. అయితే కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. ఈ క్రొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ OS 10.0 తో రన్ అవుతుంది. ఇది అప్‌గ్రేడ్ పోర్ట్రెయిట్ మోడ్, మాక్రో మోడ్ మరియు రీడింగ్ మోడ్‌తో వస్తుంది. వన్‌ప్లస్ 7 ప్రోలో లభించే స్నాప్‌డ్రాగన్ 855 SoC గ్రాఫిక్స్ కంటే 15 శాతం వేగంగా రెండరింగ్ చేయడానికి అప్‌గ్రేడ్ ప్రాసెసర్ కూడా ఉంది.

మెరుగైన మొత్తం పనితీరు, యానిమేషన్లు, విజువల్స్, మరియు అన్‌లాకింగ్ స్పీడ్ తో పాటు ఆక్సిజన్ ఓఎస్ 10.0 ద్వారా 370 సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆప్టిమైజేషన్లను వన్‌ప్లస్ 7T ప్రోకు అందిస్తుందని వన్‌ప్లస్ పేర్కొంది. ఇంకా ఈ కొత్త ఫోన్‌లోని లేజర్ AF సెన్సార్ వెనుక భాగంలో ఉంది.బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా ప్రస్తుతమున్న 4,000 mAh నుండి 4,085 mAh కు పెంచారు. అదేవిధంగా వేగవంతమైన ఫలితాలను అందించడానికి వార్ప్ ఛార్జ్ 30T ఛార్జింగ్ టెక్నాలజీని మెరుగుపరిచినట్లు కంపెనీ చెబుతోంది.

OnePlus 7T Pro Sales Start Today in India: Price, Specifications and More

స్పెసిఫికేషన్ల విషయంలో ఇది డ్యూయల్ సిమ్ (నానో) ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 6.67-అంగుళాల క్యూహెచ్‌డి + (1440x3120 పిక్సెల్స్) ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్,19.5: 9 కారక నిష్పత్తితో వస్తుంది. డిస్ప్లే ప్యానెల్ పైన 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ మరియు డిస్ప్లే లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఫోటోలు మరియు వీడియోల కోసం వన్‌ప్లస్ 7T ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది f/ 1.6 లెన్స్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ బిలైజేషన్ (EIS) మద్దతుతో ఉంటుంది. కెమెరా సెటప్‌లో 8 మెగాపిక్సెల్ సెన్సార్, f/ 2.4 టెలిఫోటో లెన్స్ మరియు ఓఐఎస్ సపోర్ట్ మరియు 16 మెగాపిక్సెల్ సెన్సార్, f/ 2.2 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 117 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV) ను అందిస్తుంది. ఇంకా అల్ట్రాషాట్, నైట్‌స్కేప్, పోర్ట్రెయిట్, ప్రో మోడ్, పనోరమా, హెచ్‌డిఆర్, ఎఐ సీన్ డిటెక్షన్ మరియు రా ఇమేజ్ వంటి లక్షణాలు ఉన్నాయి.

వన్‌ప్లస్ 7 టి ప్రోలో సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఇది ఒక మైక్రాన్ పిక్సెల్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది మరియు f/ 2.0 లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఫేస్ అన్‌లాక్, హెచ్‌డిఆర్, స్క్రీన్ ఫ్లాష్ మరియు ఫేస్ రీటౌచింగ్ వంటి ప్రీలోడ్ చేసిన ఫీచర్లతో సెల్ఫీ కెమెరా పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
OnePlus 7T Pro Sales Start Today in India: Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X