16GB RAM ,100W ఫాస్ట్ ఛార్జింగ్ తో కొత్త OnePlus ఫోన్! ధర, స్పెసిఫికేషన్లు
వన్ ప్లస్ సంస్థ నుండి OnePlus Ace 3 తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా గురువారం చైనాలో లాంచ్ చేయబడింది. ఈ కొత్త OnePlus హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్,1.5K రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల BOE ఓరియంటల్ అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది.
OnePlus Ace 3 స్మార్ట్ ఫోన్ 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ యూనిట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క ఇతర ముఖ్యాంశాలలో గరిష్టంగా 16GB RAM, ఆండ్రాయిడ్ 14, స్టీరియో స్పీకర్లు మరియు గరిష్టంగా 512GB స్టోరేజీ ఉన్నాయి. వన్ ప్లస్ ఏస్ 3 భారతదేశం మరియు ఇతర ప్రపంచ మార్కెట్లలో OnePlus 12R గా ఈ నెలాఖరులో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు.

OnePlus Ace 3 ధర వివరాలు
OnePlus Ace 3 బేస్ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,599 (దాదాపు రూ. 30,000) మరియు 16GB RAM + 512GB మోడల్ కోసం CNY 2,999 (దాదాపు రూ. 33,000)గా నిర్ణయించబడింది. టాప్ మోడల్ వేరియంట్ 16GB RAM + 1TB స్టోరేజీ ఎంపిక కూడా CNY 3,499 (దాదాపు రూ. 40,000) వద్ద అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ మూన్ సీ బ్లూ, మింగ్ షా జిన్ మరియు స్టార్ బ్లాక్ (చైనీస్ నుండి అనువదించబడింది) రంగులలో వస్తుంది మరియు ప్రస్తుతం ప్రీ-బుకింగ్ కోసం ఇది సిద్ధంగా ఉంది. ఇది జనవరి 15 నుండి చైనాలో సేల్ కు రాబోతోంది.
OnePlus తన 'స్మూత్ బియాండ్ బిలీఫ్' ఈవెంట్‌ను జనవరి 23న న్యూఢిల్లీలో వన్ ప్లస్ 12 మరియు వన్ ప్లస్ 12R లను లాంచ్ చేయడానికి ఈవెంట్ నిర్వహిస్తోంది. ఇక మరొక్క విషయం ఏమిటంటే వన్ ప్లస్ 12R ఫోన్ వన్ ప్లస్ ఏస్ 3 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని భావిస్తున్నారు.
OnePlus Ace 3 స్పెసిఫికేషన్‌ల వివరాలు
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 లో ColorOS 14.0 తో రన్ అవుతుంది మరియు 6.78 అంగుళాల (1,264x2,780 పిక్సెల్‌లు) ఓరియంటల్ అమోలెడ్ LTPO డిస్‌ప్లే గరిష్టంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3160Hz శాంప్లింగ్ రేట్ టచ్, 2160Hz తక్షణ స్పర్శ నమూనా రేటు మరియు 120Hz వరకు అనుకూల రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్‌ప్లే HDR కి మద్దతును అందిస్తుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను కలిగి ఉంది.
డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌లో అల్యూమినియం అల్లాయ్ మెటల్ మిడిల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్లలో, ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC, 12GB లేదా 16GB LPDDR5x RAM ఎంపికలు మరియు అడ్రెనో 740 GPU ఉన్నాయి. ఇది 1TB UFS 4.0 స్టోరేజీ ని కలిగి ఉంటుంది.
ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, వన్ ప్లస్ ఏస్ 3 వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది f/1.8 లెన్స్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా యూనిట్‌లో f/2.2 లెన్స్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు f/2.4 లెన్స్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, ఇది f/2.4 లెన్స్‌తో ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెన్సార్ వస్తుంది.
వన్ ప్లస్ ఏస్ 3 లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, బైదు, గ్లోనాస్, గెలీలియో, GPS మరియు NFC ఉన్నాయి. సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, ఇ-కంపాస్, గైరోస్కోప్, గ్రావిటీ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, IR కంట్రోల్, లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు X-యాక్సిస్ లీనియర్ మోటారు కూడా ఉన్నాయి. ఇది డాల్బీ అట్మోస్‌కు మద్దతుతో స్టీరియో స్పీకర్‌లను ప్యాక్ చేస్తుంది.
వన్ ప్లస్ ఏస్ 3 ఫోన్ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, దీనితో కేవలం 27 నిమిషాల్లో బ్యాటరీని సున్నా నుండి 100 శాతానికి నింపుతుందని చెప్పబడింది. అంతేకాకుండా, ఈ ఫోన్ 163.3x75.3x8.8mm కొలతల డిజైన్ తో 207 గ్రాముల బరువు ఉంటుంది.


Click it and Unblock the Notifications








