7800mAh భారీ బ్యాటరీ, 1.5K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో వన్‌ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్..!
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ (OnePlus 15 Smartphone) విడుదల, స్పెసిఫికేషన్‌లు వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 15 తోపాటు వన్‌ప్లస్ ఏస్ 6 స్మార్ట్‌ఫోన్ కూడా అక్టోబర్ 27 వ తేదీన చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో 2026 జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ ఏస్ 6 స్మా్ర్ట్‌ఫోన్ (వన్‌ప్లస్ 15R) :
తాజాగా వన్‌ప్లస్ ఏస్ 6 స్మా్ర్ట్‌ఫోన్ (OnePlus Ace 6 Smartphone) గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 15R పేరుతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ చైనాలో విడుదలకు ముందే అనేక వివరాలను సంస్థ వెల్లడించింది.

భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
వన్‌ప్లస్ ఏస్ 6 స్మార్ట్‌ఫోన్ 165Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్ 7800mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
భారీ బ్యాటరీ కారణంగా హెవీ యూజర్లు కూడా బ్యాటరీ లైఫ్ పై ఎటువంటి ఆందోళన చెందకుండా ఉపయోగించుకొనేందుకు వీలుంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 120W వైర్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. ఈ పవర్ అడాప్టర్‌తో తక్కువ సమయంలో ఫుల్ ఛార్జింగ్ చేసేందుకు అవకాశం ఉంది.
మెటల్ ఫ్రేమ్, IP68 రేటింగ్! :
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ ఏస్ 6 స్మా్ర్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ కెమెరాల స్పెసిఫికేషన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ సిల్వర్, డార్క్ బ్లూ/ బ్లాక్, వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ :
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 165Hz రీఫ్రెష్ రేట్ తో 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది.
మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ JN5 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ శాండ్ డూన్, అబ్‌సెల్యూట్ బ్లాక్, మిస్ట్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








