Home
Mobile

7800mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు..!

వన్‌ప్లస్‌ ఏస్ 6 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Ace 6 Smartphone) విడుదల అయింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లోనే లాంచ్‌ అయింది. భారత్‌ సహా గ్లోబల్ మార్కెట్‌ లో ఈ ఫోన్ వన్‌ప్లస్ 15R (OnePlus 15R Smartphone) పేరుతో అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ SoC చిప్‌సెట్‌, మెటల్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ప్లస్‌ కీ తో లాంచ్‌ అయింది. ఈ ఫోన్ 7800mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

వన్‌ప్లస్ ఏస్ 6 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.83 అంగుళాల 1.5K (1272 x 2800 పిక్సల్స్‌) ఫ్లా్ట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 165Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కంటి రక్షణకు సంబంధించిన (Eye Protection) ఫీచర్‌లను కలిగి ఉంది.

Oneplus Ace 6 Smartphone launched

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 OS :
వన్‌ప్లస్‌ ఏస్‌ 6 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. గ్రాఫిక్స్‌ కోసం G2 గేమింగ్‌ చిప్‌ ను కూడా అమర్చి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది.

50MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంది.

7800mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 120W ఫాస్ట్‌ వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7800mAh బ్యాటరీని కలిగి ఉంది. IP66 + IP68+ IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ ఫోన్‌ ప్లస్ కీ ను కూడా కలిగి ఉంది. దీని ద్వారా AI ప్లస్‌ మైండ్‌ స్పేస్‌ లాంచ్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఇన్‌-డిస్‌ప్లే 3D ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ ఏస్‌ 6 స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
చైనా మార్కెట్‌లో ఈ ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2599 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.32,300) గా ఉంది. ఈ ఫోన్ 16GB/256GB, 12GB/512GB, 16GB/512GB, 16GB/1TB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి ఉంటుంది.

వన్‌ప్లస్‌ ఏస్‌ 6 స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో అక్టోబర్ 30 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. మూడు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే భారత్‌లో ఈ ఫోన్‌ వన్‌ప్లస్ 15R పేరుతో లాంచ్‌ కానుందని భావిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Ace 6 Smartphone launched with 7800mAh battery, Snapdragon 8 Elite Chip
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X