ఏకంగా 8300mAh బ్యాటరీతో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
OnePlus Ace 6T Smartphone : వన్‌ప్లస్ ఏస్ 6T స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు 8300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్ వన్‌ప్లస్ 15R పేరుతో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
వన్‌ప్లస్ ఏస్ 6T స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్ 6.83 అంగుళాల 1.5K ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 165Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్, 3840Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 16GB LPDDR5x అల్ట్రా ఫాస్ట్ ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు Adreno 829 GPU ను కూడా అమర్చి ఉంది. వీటితోపాటు P3 డిస్‌ప్లే చిప్, G2 గేమింగ్ నెట్‌వర్క్ చిప్‌ను కూడా కలిగి ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేజైషన్) సపోర్టుతో 50MP IMX906 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సోనీ IMX480 ను అమర్చి ఉంది.
8300mAh భారీ బ్యాటరీతో :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్టుతో 8300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను అమర్చారు.
వన్‌ప్లస్ ఏస్ 6T ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ చైనాలో విడుదల అయింది. ఆ మార్కెట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.2599 Yuan (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.33,100) గా ఉంది. 16GB/256GB, 12GB/512GB, 16GB/512GB, 16GB/1TB వేరియంట్స్‌లో లభిస్తుంది.
* వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ :
అయితే వన్‌ప్లస్ ఏస్ 6T స్మార్ట్‌ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 15R పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా ఈ రెండు మార్కెట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. భారత్లో ఈ ఫోన్ డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుంది.
వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫాం ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్న తొలి ఫోన్ ఇదేనని వన్‌ప్లస్ తెలిపింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది. IP66, IP68, IP69, IP69K రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








