Home
Mobile

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేశారా.. సంస్థ ప్రకటించిన రిఫండ్‌ గురించి మీకు తెలుసా?

వన్‌ప్లస్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. వన్‌ప్లస్‌ 12R (Oneplus 12R Smartphone) హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు రిఫండ్‌ కోరవచ్చని వెల్లడించింది. మార్చి 16 వరకు ఈ అవకాశం ఉందని సంస్థ తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో యూనివర్సల్‌ ఫ్లాష్‌ స్టోరేజీ (UFS) పై తప్పుడు సమాచారం అందించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వన్‌ప్లస్‌ వెల్లడించింది.

గత నెలలో వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ ఆధారిత ఆక్సిజన్‌ OS సహా స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో విడుదల చేసింది.

Oneplus announced refund on Oneplus 12R smartphone

8GB ర్యామ్‌+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.39,999గా, అదే 16GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.45,999 గా ఉంది. అయితే విడుదల సమయంలో ఈ ఫోన్‌ UFS 4.0 స్టోరేజీ కలిగి ఉంటుందని సంస్థ ప్రకటన చేసింది. అయితే ఈ సమాచారం వెల్లడిలో తప్పు చోటుచేసుకుందని 256GB స్టోరేజీ వేరియంట్‌ UFS 3.0 స్టోరేజీతో విడుదల అయ్యాయని పేర్కొంది.

ఈ కారణంగా వన్‌ప్లస్‌ 12R 256GB స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేసిన వారికి నగదును రిఫండ్‌ (Oneplus 12R smartphone Refund) చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. UFS 3.0 నచ్చనివారు పూర్తి రిఫండ్‌ పొందవచ్చని, సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ లేదా కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోరింది.

Oneplus announced refund on Oneplus 12R smartphone

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1264*2780 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది. అల్యూమినియం మెటల్‌ ఫ్రేమ్‌, గ్లాస్‌ను కలిగి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB లేదా 16GB LPDDR5x ర్యామ్‌ మరియు అడెన్నో 740 GPU తో జతచేయబడుతుంది. గరిష్ఠంగా 1TB స్టోరేజీని కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో కూడిన 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.4 లెన్స్‌తో కూడిన 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus announced refund on Oneplus 12R smartphone 256GB storage variant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X