Home
Mobile

స్టూడెంట్స్‌కు బంపరాఫర్ ఇస్తున్న వన్‌ప్లస్‌

ఈ కామర్స్ దిగ్గజాలు పోటీలు పడీ ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారుల్లో తెగ ఖుషీ నెలకొని ఉంది.

By Hazarath Aiah

ఈ కామర్స్ దిగ్గజాలు పోటీలు పడీ ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారుల్లో తెగ ఖుషీ నెలకొని ఉంది. ఇందులో బాగంగా ఈ మధ్య అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ మధ్య ఆఫర్ల మోత మోగించాయి. ఇప్పుడు పేటీఎం కూడా వారి సరసన చేరింది. అయితే ఇప్పుడు మళ్లీ వీటి మధ్యకు చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి వన్‌ప్లస్‌ దూసుకొచ్చింది. విద్యార్థులకు ఎక్స్‌క్లూజివ్‌గా ఈ కామర్స్ దిగ్గజాలతో పనిలేకుండా సొంతంగా ఓ వినూత్నమైన సేల్‌ను ప్రారంభిస్తుంది. బ్యాక్‌-టూ-స్కూల్‌-సేల్‌ పేరుతో దీన్ని నిర్వహిస్తుంది.

జూలై 23 నుంచి జూలై 30 వరకు..

జూలై 23 నుంచి జూలై 30 వరకు..

జూలై 23 నుంచి జూలై 30 వరకు జరిగే సేల్‌లో వన్‌ప్లస్‌ ఉత్పత్తులు కొనుగోలు చేసే విద్యార్థులకు బంపర్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

వన్‌ప్లస్‌ 6

వన్‌ప్లస్‌ 6

ఈ సేల్‌లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌పై భలే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో వన్‌ప్లస్‌ 6 కొనుగోలు చేసే వారికి రూ.1500 డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

 అమెజాన్‌ను నుంచి ..

అమెజాన్‌ను నుంచి ..

అంతేకాక అమెజాన్‌ను నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావించే వారికి నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు వన్‌ప్లస్‌ కేసులు, కవర్లపై వన్‌ప్లస్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది.

మొత్తంలో 30 శాతం వారే

మొత్తంలో 30 శాతం వారే

మా కోర్‌ యూజర్లు 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న విద్యార్థులని, మా కమ్యూనిటీ మొత్తంలో 30 శాతం వారే ఉన్నారని కంపెనీ చెబుతోంది. విస్తృతంగా పరిశోధన చేసిన అనంతరం, కన్జ్యూమర్లు డివైజ్‌లను కొంటారు.

విద్యార్థులే మాకు యూజర్లు

విద్యార్థులే మాకు యూజర్లు

విద్యార్థులు అత్యంత డిమాండ్‌ ఉన్న వినియోగదారులు. ఈ నేపథ్యంలో మా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో పెట్టుబడి పెట్టడం అత్యంత కీలకం' అని వన్‌ప్లస్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ వికాస్‌ అగర్వాల్‌ అన్నారు.

ఖరీదు రూ.34,999

ఖరీదు రూ.34,999

వన్‌ప్లస్‌ ఉత్పత్తులను విద్యార్థులకు మరింత చేరువ చేయడమే ఈ సేల్‌ లక్ష్యమని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు రూ.34,999గా ఉంది.

ఫీచర్ల విషయానికొస్తే..

ఫీచర్ల విషయానికొస్తే..

5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1800 x 3200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, వెనుక భాగంలో 23 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లో లభ్యం కానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus announces 'back to school' offers: here are all the details More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X