OnePlus ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లు

OnePlus 5పై రూ.4000 డిస్కౌంట్...

|

ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టి 1000 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బాన్ని పురస్కరించుకుని OnePlus మూడు రోజుల ప్రత్యేక సేల్ ను అనౌన్స్ చేసింది. వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్ వేదికగా సెప్టంబర్ 5వ తేదీన ప్రారంభమయ్యే ఈ స్పెషల్ సెప్టంబర్ 7, 2017తో ముగుస్తుంది.

ఒక్క రోజులో 60 లక్షల జియోఫోన్‌లను బుక్ చేసారుఒక్క రోజులో 60 లక్షల జియోఫోన్‌లను బుక్ చేసారు

 రూ.25,999కే  OnePlus 3T

రూ.25,999కే OnePlus 3T

ఈ మూడు రోజుల సేల్ పిరియడ్‌లో భాగంగా కంపెనీ రెండవ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన OnePlus 3T రూ.4,000 తగ్గింపుతో రూ.25,999కే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ ఫోన్‌ను ఎక్స్‌ఛేంచ్ చేసుకున్నట్లయితే అదనంగా రూ.2,000 తగ్దింపు మీకు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే అదనంగా మరో రూ.2000 తగ్గింపును మీరు పొందవచ్చు. ఇలా అన్ని ఆఫర్లను మీరు ఉపయోగించుకున్నట్లయితే రూ.21,999కే వన్‌ప్లస్ 3టీ మీ సొంతమవుతుంది.

 OnePlus 5పై రూ.4000 డిస్కౌంట్‌

OnePlus 5పై రూ.4000 డిస్కౌంట్‌

ఇదే సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన OnePlus 5పై రూ.4000 డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్‌లను నెలసరి వాయిదాల పై సొంతం చేసుకోవాలనుకునేవారికి 12 నెలల జీరో కాస్ట్ ఈఎమ్ఐను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ మూడు రోజుల సేల్ లో భాగంగా 100 మంది లక్కీ కస్టమర్‌లకు డొమస్టిక్ ఫ్లైట్ వోచర్‌లను క్లియర్‌ట్రిప్ అందించనుంది.

OnePlus 3T స్పెసిఫికేషన్స్...
 

OnePlus 3T స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (పిక్సల్ రిసల్యూషన్ 401 పీపీఐ), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై వన్‌ప్లస్ 3టీ ఫోన్ రన్ అవుతుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 చిప్‌సెట్‌, 6జీబి ర్యామ్‌, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ, 3.5mm headphone jack, 3000 mAh బ్యాటరీ విత్ డాష్ ఛార్జ్ సపోర్ట్‌.

OnePlus 5 మరింత స్లిమ్‌..

OnePlus 5 మరింత స్లిమ్‌..

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని వన్‌ప్లస్ ఫోన్‌లలో కల్లా OnePlus 5 మరింత స్లిమ్‌గా కనిపిస్తోంది. ఈ ఫోన్ మందం 7.25 మిల్లీ మీటర్లు. బరువు 153 గ్రాములు. చుట్టుకొలతలు 154.2 x 74.1 x 7.25 మిల్లీ మీటర్లు. ప్రత్యేకమైన అల్యూమినియమ్ యునిబాడి డిజైన్‌తో వన్‌ప్లస్ 5 వస్తోంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి OnePlus 5 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్)తో వస్తోంది. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్ ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

Qualcomm Snapdragon 835 ప్రాసెసర్‌

Qualcomm Snapdragon 835 ప్రాసెసర్‌

OnePlus 5 స్మార్ట్‌ఫోన్, 2.45Ghz క్లాక్ స్పీడును కలిగిన శక్తివంతమైన Qualcomm Snapdragon 835 ప్రాసెసర్‌తో వస్తోంది. గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అడ్రినో 540 గ్రాఫిక్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే OnePlus 5 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ కెపాసిటీతో దొరుకుతుంది. రెండవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో దొరుకుతుంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆధారంగా డిజైన్ చేసిన లేటెస్ట్ వర్షన్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్ం పై OnePlus 5 స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

డ్యుయల్ కెమెరా సెటప్

డ్యుయల్ కెమెరా సెటప్

OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ప్రధాన హైలైట్. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ కాంభినేషన్ లో రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 16 మెగా పిక్సల్ కెమెరాను సోనీ IMX398 సెన్సార్ తో తీర్చిదిద్దగా, 20 మెగా పిక్సల్ టెలీఫోటో కెమెరాను సోనీ IMX350 సెన్సార్‌తో తీర్చిదిద్దారు. ఐఫోన్ 7 ప్లస్ తరహాలో ఈ కెమెరా 'bokeh' ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరా వన్‌ప్లస్ 3టీతో పోలిస్తే వేగవంతమైన ఆటో‌ఫోకస్‌ను అందింగలదని కంపెనీ చెబుతోంది. ఈ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ మాడ్యుల్ ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకునే వీలుంటుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

3300mAh బ్యాటరీతో..

3300mAh బ్యాటరీతో..

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ 3300mAh బ్యాటరీతో వస్తోంది. Dash Chargingను ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీతో ఫోన్‌ను ఒక గంటసేపు ఛార్జ్ చేస్తే చాలు రోజంతా వాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
OnePlus Announces OnePlus 1000 Days Sale in India; Grab a OnePlus 3T at Just Rs.25,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X