స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చెరగని ముద్ర : వన్‌ప్లస్ బ్రాండ్

Written By:

చైనా దిగ్గజ మొబైల్ సంస్థ వన్‌ప్లస్ 2013లో మార్కెట్లోకి దూసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి యూజర్లను ఆకట్టుకుంటూ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అన్ని కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను లాభాలను ఆర్జించడానికి మార్కెట్లోకి తీసుకువస్తాయి. అయితే వన్‌ప్లస్ కంపెనీ లాభాలతో పాటు యూజర్లకు మన్నికైన ఫీచర్లను తమ ఫోన్ల ద్వారా అందిస్తూ వారి అభిమానాన్ని చూరగొంటోంది.

గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ కంపెనీ ఇతర కంపెనీలకు గట్టిపోటీనిస్తూ రేసులో దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఫోన్లో ఏదో కొత్త దనాన్ని అందించడమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. వన్‌ప్లస్ మార్కెట్లో ఇప్పుడు ఒంటరి కాదు. ఎంతో మంది యూజర్లు తోడుగా ముందుకు దూసుకువెళుతోంది. చైనాలో టాప్ పొజిషన్లో ఉన్న ఈ కంపెనీ ఇండియాతో పాటు ప్రపంచదవ్యాప్తంగా అనేకమంది అభిమానులను సొంతం చేసుకున్నదంటే దాని వెనుక సంస్థ అధినేతల కఠోర శ్రమ దాగి ఉంది. ఈ సంస్థను స్థాపించిన Peter Vesterbacka కృషి చాలా ఉన్నతమైంది. అందరూ ఇష్టపడే గేమ్ యాంగ్రిబర్డ్స్ సృష్టికర్త కూడా ఇతనే.

వాట్సప్ మోజులో మీరు మరిచిపోయిన బెస్ట్ యాప్స్ ఏంటో తెలుసా ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తన 20 ఏళ్ళ ప్రయాణంలో

తన 20 ఏళ్ళ ప్రయాణంలో Peter Vesterbacka అనేక ఎత్తుపల్లాలను చూశారు. జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కున్నారు. ఈ ఒడిదుడుకుల మధ్య నుంచే వన్‌ప్లస్ కంపెనీ పురుడు పోసుకుంది. వన్‌ప్లస్ సక్సెస్ గురించి ఓ చిన్న వీడియోలో Peter Vesterbacka అనేక రకాలైన ఆసక్తికర విషయాలు తెలిపారు. కంపెనీ విజయం వెనుక రహస్యాలను పంచుకున్నారు.

వన్‌ప్లస్ కంపెనీ ప్రారంభంలో..

వన్‌ప్లస్ కంపెనీ ప్రారంభంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కుందని ఆ తర్వాతే అది మెల్లగా పుంజుకుందని తెలిపారు. చాలామంది ఈ కంపెనీని ప్రారంభంలో విమర్శించారని అయితే అవేమి దీని విజయానికి అడ్డురాలేదని కొత్త మైళురాళ్లను చేరుకోవడానికి ఆ విమర్శలే పునాది రాళ్లు అయ్యాయని సగర్వంగా చెబుతున్నారు.

వన్‌ప్లస్ కంపెనీ ఐడియాలజీతోనే

వన్‌ప్లస్ ఫోన్లలో ముఖ్యంగా గేమ్స్ చాలా ఆకర్షిస్తాయి. ఈ ఫోన్లలో పుల్ వ్యూ డిస్ ప్లేతో గేమ్ కనిపిస్తూ యూజర్లను చూపుతిప్పుకోననీయకుండా కట్టిపడేస్తాయి. మంచి అనుభూతిని అందిస్తాయి. ఈ ఫోన్లలో రెండు సిమ్ కార్డులను పొందుపరచడం ద్వారా యూజర్లకు చాలా సహయకారిగా ఈ ఫోన్లు మారాయి. ఎన్నో కంపెనీలు వన్‌ప్లస్ కంపెనీ ఐడియాలజీతోనే ఆ తర్వాత మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే అవి వన్‌ప్లస్ ని మాత్రం చేరుకోలేకపోయాయి. కాగా రానున్న రోజుల్లో ఈ అధినేతపై మరిన్ని స్టోరీలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత మన్నికైన స్టార్టప్ కంపెనల్లో వన్‌ప్లస్ కంపెనీదే అగ్రతాంబూలం.

డిజైన్ మీద పెట్టిన ప్రధాన దృష్టి ..

వన్‌ప్లస్ కంపెనీ మరో విజయ రహస్యం ఏంటంటే ఈ ఫోన్ డిజైన్ మీద పెట్టిన ప్రధాన దృష్టి ఈ ఫోన్ డిజైన్ యాజర్లను ఇట్టే కట్టిపడేసింది. మంచి క్వాలిటీతో పాటు యూజర్లకు అత్యంత మన్నికను అందిస్తూ విశ్వసనీయమైన బ్రాండ్ గా అవతరించింది. కస్టమర్లు పెట్టిన డబ్బుకు న్యాయం చేసేలా ఫోన్లను వారికి అందిస్తూ వస్తోంది. ఇప్పటికే చాలామంది వన్‌ప్లస్ కంపెనీ నుంచి త్వరలో రాబోతున్న వన్‌ప్లస్ 6 కోసం ఎదురుచూస్తున్నారు. అది వస్తే స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మరో అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus: Breaking boundaries of a conventional smartphone brand More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot