వన్‌ప్లస్ 6లో సెక్యూరిటీ లోపం,ఫోనంతా హ్యాకర్ల చేతిలోకి !

|

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కంపెనీ ఇటీవలే తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6ను తాజాగా మార్కెట్లోకి లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఫోన్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఏదో ఒక ఇష్యూతో వార్తలో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త సెక్యురిటీ లోపాన్ని సెక్యురిటీ రీసెర్చర్లు గుర్తించారు. ఈ లోపంతో, యూజర్ల ఫోనంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందని రీసెర్చర్లు కనుగొన్నారు. అమెరికాకు చెందిన ఎడ్జ్‌ సెక్యురిటీ ఎల్‌ఎల్‌సీ జాన్సన్‌ డోనెన్‌ఫీల్డ్‌ ఈ లోపాన్ని గుర్తించారు.

 

భారీ డిస్కౌంట్‌తో ఎల్‌జీ క్యూ6,హైలెట్ ఫీచర్లు ఇవే..భారీ డిస్కౌంట్‌తో ఎల్‌జీ క్యూ6,హైలెట్ ఫీచర్లు ఇవే..

ఏడీపీతో బూట్‌ ఇమేజ్‌ మార్చబడితే..

ఏడీపీతో బూట్‌ ఇమేజ్‌ మార్చబడితే..

అసురక్షితంగా ఉన్న ఏడీపీతో బూట్‌ ఇమేజ్‌ మార్చబడితే, హ్యాకర్లు ఫిజికల్‌ యాక్సస్‌తో మొత్తం డివైజ్‌ను తమ నియంత్రణలో తెచ్చుకోగలరని రీసెర్చర్‌ ఎల్‌ఎల్‌సీ జాన్సన్‌ డోనెన్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు. కాగా ఏడీబీ అనేది డిఫాల్ట్‌గా సెట్‌ చేయబడి ఉంటుంది.

యూజర్లు ఎంతో అప్రమత్తతో ఉండాలని..

యూజర్లు ఎంతో అప్రమత్తతో ఉండాలని..

ఈ సెక్యూరిటీ లోపంతో యూజర్లు ఎంతో అప్రమత్తతో ఉండాలని, స్మార్ట్‌ఫోన్‌లో ప్రైవేట్‌ డేటా స్టోర్‌ చేసుకుని ఉంచుకున్న వారు ఆందోళన చెందాల్సినవసరం ఉందని ఎక్స్‌డీఏ రిపోర్టు చేసింది. ఈ సెక్యురిటీ లోపాన్ని కంపెనీకి కూడా రిపోర్టు చేసింది.

న్‌ప్లస్‌ కంపెనీ ఓ అధికారిక ప్రకటన
 

న్‌ప్లస్‌ కంపెనీ ఓ అధికారిక ప్రకటన

కాగా ఈ రిపోర్టుపై వన్‌ప్లస్‌ కంపెనీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘వన్‌ప్లస్‌లో సెక్యురిటీ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాం. సెక్యురిటీ రీసెర్చర్‌తో మేమే కాంటాక్ట్‌ అయ్యాం. త్వరలోనే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను చేపడతామని కంపెనీ తెలిపింది.

ప్రధాన ఫీచర్లు

ప్రధాన ఫీచర్లు

గత నెలలోనే వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర 34,999 రూపాయలు. ​క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌తో ఈ స్మా‍ర్ట్‌ఫోన్‌ రూపొందింది. ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 6జీబీ/8జీబీ ర్యామ్‌, 64జీబీ/128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ దీనిలో ప్రధాన ఫీచర్లు.

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

Best Mobiles in India

English summary
OnePlus confirms ‘security flaw’ in OnePlus 6 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X