ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో OnePlusదే హవా..!

  ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న వన్‌ప్లస్, తన బ్రాండ్ వాల్యూను మరింతగా పెంచుకుంటోంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇప్పటివరకు మార్కెట్లో లాంచ్ అయిన ప్రతి స్మార్ట్‌ఫోన్ అటు పనితీరు పరంగా, ఇటు ధర పరంగా ఏ ఒక్కరిని నిరుత్సాహాపరచలేదు.

  ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో OnePlusదే హవా..!

   

  హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందించటమే వన్‌ప్లస్ ప్రధాన లక్ష్యం. 2014లో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన వన్‌ప్లస్ ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. కౌంటర్ పాయింట్ రిసెర్చ్ విడుదల చేసిన తాజా విశ్లేషణ ప్రకారం 2018 మూడువ క్వార్టర్‌కు గాను అత్యధిక ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ లను విక్రయించిన బ్రాండ్‌గా వన్‌ప్లస్ రికార్డ్ నెలకొల్పింది.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  30 శాతం మార్కెట్ వాటాతో..

  కౌంటర్ పాయింట్ రిసెర్చ్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో వన్‌ప్లస్, సామ్‌సంగ్, యాపిల్ వంటి బ్రాండ్‌లు 83శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఈ 83 శాతంలో 30 శాతం ఫోన్‌లు వన్‌ప్లస్ నుంచే అమ్ముడవటం విశేషం. వన్‌ప్లస్ బ్రాండ్ వాల్యూను పెంచటంలో వన్‌ప్లస్ 6 కీలక పాత్ర పోషించింది.

  మే, 2018లో లాంచ్ అయిన వన్‌ప్లస్ 6 రూ.30,000 బడ్జెట్‌లో బెస్ట్ ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపుతెచ్చుకుంది. హైక్వాలిటీ మెటీరియల్స్‌తో అత్యంత ఆకర్షణీయంగా క్రాఫ్ట్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి‌లుక్‌లోనే మనల్ని ఇంప్రస్ చేసేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చసిన గ్లాస్ ప్యానల్ ప్రీమియమ్ ఇంకా అధునాతన లుక్‌ను ఆఫర్ చేస్తుంది. ఫోన్ ముందు ఇంకా వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డివైస్ డ్యురబులిటీని మరింత రెట్టింపు చేసింది.

   

  వ్యూహాత్మకంగా మార్కెట్లోకి..

  మార్కెటింగ్‌ను ఓ ఛాలెంజ్‌గా స్వీకరించిన వన్‌ప్లస్, కొత్త ఫోన్‌ను లాంచ్ చేసే ప్రతి సందర్భంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వన్‌ప్లస్ 6టీ లాంచ్‌కు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ను వన్‌ప్లస్ రంగంలోకి దింపింది.

  ఈయనతో రూపొందించిన వన్‌ప్లస్ 6టీ టీవీ యాడ్ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తొలి నుంచి కన్స్యూమర్ సెంట్రిక్ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న వన్‌ప్లస్, యూజర్ అవసరాలను అనుగుణంగానే స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తూ వస్తోంది. తమ వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో అంతరాయంలోనే సర్వీస్ ఎక్స్‌పీరియన్స్‌ను వన్‌ప్లస్ ప్రొవైడ్ చేస్తోంది.

   

  ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు..

  నిన్న మొన్నటి వరకు ఆన్‌లైన్ మార్కెట్‌కు మాత్రమే పరిచయమైన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇక పై ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ లభ్యంకానున్నాయి. తన వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ డిజిటల్‌తో వన్‌ప్లస్ చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో నెం.1 రిటైలింగ్ చెయిన్‌గా అవతరించిన రిలయన్స్ డిజిటల్‌ వన్‌ప్లస్ మొబైల్ ఫోన్‌లను ఆఫ్‌లైన్‌లో విక్రయించబోతోంది. కస్టమర్స్ వీటిని కొనుగోలు చేసే ముందు ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశాన్ని కూడా ఈ రిటైల్ చెయిన్ కల్పించబోతోంది. రిలయన్స్ డిజిటల్‌ స్టోర్‌లలో విక్రయించే వన్‌ప్లస్ ఫోన్‌ల పై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆన్‌లైన్‌లో ఎంత ధర అయితే ఉంటుందో ఆఫ్‌లైన్‌‍లోనూ అంతే ధర ఉంటుంది.

   

   

   

  9 నగరాల్లో పాప్-అప్ ఈవెంట్స్..

  OnePlus 6T విడుదలను పురస్కరించుకుని 9 నగరాల్లోని 12 లొకేషన్‌లలో పాప్-అప్ ఈవెంట్‌లను ప్లాన్ చేసినట్లు వన్‌ప్లస్ తెలిపింది. నవంబర్ 2 నుంచి ఈ పాప్-అప్స్ లైవ్‌లోకి వస్తాయి. ఈ పాప్-అప్ ఈవెంట్‌లలో పార్టిసిపేట్ చేసే యూజర్లు ముందుగా ఫోన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసి ఆ తరువాత కొనాలా వద్దా అన్న డెషిషన్‌ను తీసుకోవచ్చు. బెంగుళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇంకా జైపూర్ నగరాల్లో ఈ పాప్-అప్స్ లైవ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ పాప్-అప్ ఈవెంట్‌లకు ముందుగా హాజరయ్యే వారికి వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కవర్స్, బంపర్స్, స్కెచ్‌ ‌బుక్స్, టీ-షర్ట్స్ ఇంకా టోట్ బ్యాగ్స్ ఉచితంగా లభిస్తాయి.

  అక్టోబర్ 30న మార్కెట్లోకి..

  ఇండియాలో వన్‌ప్లస్ 6టీ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 30, 2018న జరుగుతుంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్ లో రాత్రి 8.30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులకు అక్కడ ఏర్పాటు చేసే ఎక్స్‌పీరియన్స్ జోన్‌లో ఫోన్‌ను చేతితో పట్టుకుని చూడటంతో పాటు డివైస్ పనితీరను విశ్లేషించే వీలుంటుంది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యే ఫ్యాన్స్‌కు వన్‌ప్లస్ బుల్లెట్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్స్, వన్‌ప్లస్ పిన్ సెట్, వన్‌ప్లస్ స్కెచ్‌బాక్స్ ఇంకా వన్‌ప్లస్ మర్చండైస్‌లతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్ లభిస్తుంది.

   

   

  లేటెస్ట్ స్పెక్స్, పవర్‌‌ఫుల్ పెర్ఫామెన్స్..

  Android Pie ఆపరేటింగ్ సిస్టంతో భారత్ లోకి అడుగుపెట్టబోతోన్న మొదటి నాన్-పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ 6టీ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంలోని అడాప్టివ్ బ్యటరీ ఫీచర్ ఫోన్‌లోని అప్లికేషన్‌లను నిరంతరం మానిటర్ చేస్తూ అవసరమైన బ్యాటరీ పవర్‌ను మాత్రమే అవి ఉపయోగించుకునేలా చూస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 మొబైల్ చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ డివైస్‌లో ప్రాసెసింగ్ మరింత యాక్యురేట్‌గా ఉంటుంది.

  ఈ ఫోన్‌లో ఎక్విప్ చేసిన ఫ్యూచరిస్టిక్ స్ర్కీన్ అన్‌లాక్ ఫీచర్ డివైస్‌ను వేగవంతంగా అన్‌లాక్ చేయగలుగుతుంది. వన్‌ప్లస్ 6తో పోలిస్తే వన్‌ప్లస్ 6టీ పెద్దదైనా ఇంకా శక్తివంతమైన బ్యాటరీతో రాబోతోంది. ఇదే సమయంలో డాష్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మరింతగా అప్‌డేట్ చేసినట్లు స్పష్టమవుతోంది. బ్యాటరీ పనితీరు విషయంలో ఇప్పటికే మంచి రెప్యుటేషన్‌ను సొంతం చేసుకున్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు భవిష్యత్‌లోనూ ఇదే విధమైన ట్రెండ్‌ను కొనసాగిస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  OnePlus continues to be consumers' first choice in the Indian market.To Know More About Visit telugu.gizbot.com
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more