Home
Mobile

OnePlus దీపావళి స్పెషల్ సేల్‌ 2024.. స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్‌లు.. లిస్ట్‌..!

దీపావళి సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ ప్రత్యేక సేల్‌ (OnePlus Diwali Sale 2024) నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఎయిర్‌పాడ్స్‌ సహా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ డిజిటల్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌ సహా మరిన్ని స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ దీపావళి సేల్‌ 2024 నవంబర్‌ 5 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.

వన్‌ప్లస్‌ దీపావళి సేల్‌ 2024 లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ 4, వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4, వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్‌ 12R, వన్‌ప్లస్‌ ఓపెన్‌ సహా మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్ 3, వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో వంటి TWS ఎయిర్‌పాడ్స్‌ను కూడా డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు.

OnePlus Diwali sale 2024 offers best deals on smartphones and earbuds full details

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్ (OnePlus 12R Smartphone) 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 50MP OIS, 8MP, 2MP, 16MP సెల్ఫీ కెమెరాలతో అందుబాటులో ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 100W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ దీపావళి సేల్‌లో భాగంగా ఎంపికచేసిన బ్యాంకు కార్డులతో రూ.3000 డిస్కౌంట్‌, 6 నెలలపాటు నోకాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌ను (OnePlus Nord 4) దీపావళి సేల్‌లో భాగంగా గరిష్ఠంగా రూ.2000 వరకు తగ్గింపును పొందవచ్చు. మరియు 9 నెలల వరకు నోకాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌, వన్‌ప్లస్ స్టోర్‌లు, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ హ్యాండ్‌సెట్‌పై (OnePlus Nord CE 4 Lite) రూ.2500 స్పెషల్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

దీంతోపాటు వన్‌ప్లస్‌ బడ్స్‌ను కూడా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్ 3 మరియు వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్‌ 3 ప్రో ఇయర్‌బడ్స్ కొనుగోళ్లపై రూ.200 మరియు రూ.300 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు నార్డ్ బడ్స్ 3 ప్రో పైన తాత్కాలికంగా రూ.500 తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది.

స్టూడెంట్‌ ఆఫర్‌లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో, వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్ 3 కొనుగోలుపై రూ.200 డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతోపాటు దీపావళి ఆఫర్‌లో భాగంగా నార్డ్‌ CE4 లేదా నార్డ్ CE 4 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు నార్డ్ బడ్స్‌ 3 లేదా 3 ప్రో ను కొనుగోలు చేసి తగ్గింపును పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Diwali sale 2024 offers best deals on smartphones and earbuds full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X