పాత ఫోన్లకు 16 వేలు: వన్‌ప్లస్ బంఫర్ ఆఫర్

Written By:

చైనాలో టెక్ స్టార్టప్ గా మొదలై, అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తూ, అత్యంత తక్కువ కాలంలోనే భారత మార్కెట్లోకి దూసుకొచ్చిన వన్‌ప్లస్ ఇప్పుడు అదిరిపోయే బైబ్యాక్ స్కీమ్, ఎక్స్ఛేంజ్ లను ప్రకటించింది. అవేంటంటే వన్‌ప్లస్ వన్, వన్‌ప్లస్ 2, వన్ ప్లస్ ఎక్స్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారు తమ పాత స్మార్ట్‌ఫోన్లను మార్చుకొని రూ. 16 వేల వరకూ రాయితీలను పొందవచ్చని వెల్లడించింది. ఇందుకోసం అమెజాన్, రీగ్లోబ్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని పేర్కొంది.

Read more : వన్‌ప్లస్ వన్ 16జీబి వర్షన్ కేవలం రూ.12,999!

పాత ఫోన్లకు 16 వేలు: వన్‌ప్లస్ బంఫర్ ఆఫర్

ఈ మూడు ఫోన్లలో ఏదో ఒకదాన్ని అమేజాన్ వెబ్‌సైట్ ద్వారా సెలక్ట్ చేసుకుని 'మొబైల్ బైబ్యాక్' పై క్లిక్ చేసి నిబంధనలు తెలుసుకుని 'ఐ ఎగ్రీ' బటన్ క్లిక్ చేయడం ద్వారా రీ గ్లోబ్ వెబ్‌సైట్ కు వెళ్లవచ్చని, అక్కడ అమెజాన్ ఆర్డర్ ఐడీని, మీ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఎంటర్ చేస్తే, మీకు లభించే ఆఫర్ తెలుస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఆపై రీ గ్లోబ్ ఉద్యోగి ఇంటికి వచ్చి ఫోన్ తీసుకుని అక్కడికక్కడే డబ్బు చెల్లిస్తాడని వెల్లడించింది. ఈ సందర్భంగా దుమ్ము రేపుతున్న వన్‌ప్లస్ 2 ఫీచర్స్‌పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: 4జీబి ఇంటర్నల్ మెమరీతో దొరుకుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

వన్ ప్లస్ 2 ఫింగర్ ప్రింట్ హర్డ్ వేర్ చాలా శక్తివంతమైనది.ఇది 5 ఫింగర్ ప్రింట్ లను స్కాన్ చేయగలదు. ఆపిల్ టచ్ ఐడీ కన్నా ఫాస్ట్ గా పనిచేస్తుంది.

2

వన్ ప్లస్ 2 ముబైల్ 5.5 ఇంచ్ డిస్ ప్లే తో అదిరిపోయే విధంగా ఉంటుంది. 178 వ్యూ యాంగిల్ లో ఫోటోలు తీయవచ్చు.

3

4 జిబి అండర్ హుడ్ ర్యామ్ తో పాస్ట్‌గా రన్ అయ్యే సాఫ్ట్‌వేర్‌తో మొబైల్ నడుస్తుంది. వన్ ప్లస్ 1లో కేవలం 3 జీబి ర్యామ్ మాత్రమే ఉంది. స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్

4

వన్ ప్లస్ 2 మొబైల్ లో యుఎస్ బి కనెక్షన్ అదిరిపోయే విధంగా ఉంటుంది. ప్రపంచంలోని ఏ స్మార్ట్ ఫోన్ కు లేని విధంగా యుఎస్ బి కనెక్షన్ రూపొందించారు. వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కూడా ఉంటుంది.

5

మాగ్నేషియంతో తయారుచేయబడిన మెటల్ తో ఈ ఫోన్ రూపొందించారు. బరువు వన్ ప్లస్ 1 కన్నా తక్కువగా ఉంటుంది. 175 గ్రాములు మాత్రమే ఉంటుంది.

6

13 మెగా ఫిక్షల్ కెమెరాతో అదిరిపోయే విధంగా ఫోటోలు తీయవచ్చు. అతి చిన్న ఫోటోలను కూడా అద్భుతంగా తీయవచ్చు. లేజర్ ఆటో ఫోకస్ కెమెరా ఈ ఫోన్ సొంతం.

7

వన్ ప్లష్ 2 కొత్తగా సాఫ్ట్‌వేర్‌ని రిలీజ్ చేసింది. దానిపేరే ఆక్సిజన్ ఓఎస్. ఇది చైనా వర్షన్.దీన్ని అక్కడ హైడ్రోజన్ ఓఎస్ అని పిలుస్తారు.ఇది ఆపరేటింగ్ సిస్టం

8

బ్యాటరీ సామర్థ్యం చాలా ఎక్కువ. ఛార్జింగ్ తొందరగా అయిపోదు. అలాగే నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఇది. అలాగే ఫిజికల్ బటన్ కూడా ఉంటుంది.

9

వన్ ప్లస్ 1 సింగిల్ సిమ్ సపోర్ట్ తో పని చేస్తే 2 డ్యూయెల్ సిమ్ సపోర్ట్ తో పని చేస్తుంది. అయితే వన్ ప్లస్ కూడా ఇప్పడు డ్యూయెల్ సిమ్ ఆఫర్ చేస్తోంది.

10

వన్ ప్లస్ 2 ముబైల్ కవర్ లుక్ చాలా స్మార్ట్ గా ఉంటుంది. కంపెనీ ఎక్స్ ట్రా కవర్లను కూడా మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

11

వన్ ప్లస్ 2 ధర . రూ 22999 అమెజాన్ , ఈబేలో 16,690కే దొరుకుతోంది. ఇంకా వివిధ సైట్లలో వివిధ రకాలుగా ఉంది.

12

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write OnePlus Exchange Scheme Offers Up to Rs. 16,000 for Your Old Smartphone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot