వన్‌ప్లస్ తొలి ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open విడుదల..16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా సహా మరెన్నో కీలక ఫీచర్లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 7.82 అంగుళాల అమోలెడ్ లోపలి డిస్‌ప్లేను, 6.31 అంగుళాల అవుటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 67W ఛార్జింగ్ సపోర్టుతో 4800mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
వన్‌ప్లన్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ : ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ.1,39,999గా ఉంది. ఈ ఫోన్ ఎమరాల్డ్ డస్క్, వాయేజర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ సహా ఇతర రిటైల్ దుకాణాల్లో ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ అక్టోబర్ 27 నుంచి సేల్‌కు రానుంది. ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లు ట్రేడ్ ఇన్ బోనస్ కింద రూ.8000 తగ్గింపు పొందవచ్చు. అలాగే ICICI, వన్‌కార్డ్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే తక్షణ రూ.5000 తగ్గింపును పొందుతారని వన్‌ప్లస్ వెల్లడించింది.
వన్‌ప్లస్ ఓపెన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఈ ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ OS 13.2 అవుట్ ఆఫ్ ది బాక్స్ కింద పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.82 అంగుళాల (2,268*2440 పిక్సల్) 2k ఫ్లెక్సీ ఫ్యూయడ్ LTOP 3.0 అమోలెడ్ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
మరియు 1-120Hz డైనమిక్ రీఫ్రెష్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే అల్ట్రా థిన్ గ్లా్స్ ప్రొటెక్టివ్ మెటీరియల్‌ను కలిగి ఉంటుంది. ఇది 1440Hz పల్స్ విడ్త్ మాడ్యులేషన్ డిమ్మింగ్‌ను సపోర్టు చేస్తుంది.
మరియు ఈ ఫోన్ 6.31 అంగుళాల (1116*2484) 2k LTPO 3.0 సూపర్ ఫ్యూయిడ్ అమోలెడ్ అవుటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 10-120Hz డైనమిక్ రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ రెస్పాన్స్ రేట్, 2800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ సిరామిక్ గార్డ్ ప్రొటెక్టివ్ మెటిరియల్‌ను కలిగి ఉంటుంది.
ఈ రెండు డిస్‌ప్లేలు TUV రీన్‌ల్యాండ్ ఇంటెలిజెంట్ ఐ కేర్ సర్టిఫికేట్‌ను పొందాయని సంస్థ వెల్లడించింది. వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ క్కాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ చిప్‌తో అడెన్నో 740 GPUను కలిగి ఉంటుంది. ఇది 16GB LPDDR5x ర్యామ్‌తో జతచేయబడుతుంది.

వన్‌ప్లస్ ఓపెన్ కెమెరాలు : ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 1/1.43 అంగుళాల సోనీ LYT-T808 పిక్సల్ స్టాకడ్ CMOS సెన్సార్‌తో 48MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS- ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, EIS- ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 85 డిగ్రీల ఫీల్డ్ వ్యూ మరియు f/1.7 అపేచర్‌ను కలిగి ఉంటుంది.
దీంతోపాటు 64MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఓమ్నీవిజన్ OV64B సెన్సార్‌తో OIS, EIS, 33.4 డిగ్రీల ఫీల్డ్ వ్యూ, f/2.6 అపేచర్‌ను కలిగి ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్, 6x ఇన్ సెన్సార్ జూబ్‌ను కలిగి ఉంటుంది. 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సోనీ సెన్సార్ సహా EIS, 114 డిగ్రీ ఫీల్డ్ వ్యూ మరియు f/2.2 అపేచర్‌తో వస్తుంది.
ఫోన్ ఇన్నర్ డిస్‌ప్లే పైన 20MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా EIS, 91 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ మరియు f/2.2 అపేచర్ కలిగి ఉంటుంది. దీంతోపాటు అవుటర్ డిస్‌ప్లే పైన 32MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరా EIS, 88.5 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ మరియు f/2.4 అపేచర్‌ను కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ ఓపెన్ బ్యాటరీ, ఛార్జింగ్ : ఈ స్మార్ట్‌ఫోన్ 67W సూపర్‌వోక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4800mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. మరియు ఫేస్ లాక్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈఫోన్ అనేక రకాల సెన్సార్లను కలిగి ఉంటుంది. వైఫై 7, బ్లూటూత్ 5.3 సపోర్టుతో వస్తుంది.


Click it and Unblock the Notifications








