Home
Mobile

OnePlus Flip వన్‌ప్లస్‌ ఫ్లిప్‌ ఫోన్‌ కీలక వివరాలు లీక్‌... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌లో ఫ్లిప్‌, ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. శాంసంగ్‌, వన్‌ప్లస్‌, ఒప్పో, మోటోరోలా, షియోమీ సహా అనేక ప్రముఖ సంస్థలు ఈ తరహా ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే మరిన్ని సంస్థలు ఈ తరహా ఫోన్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఆపిల్ కూడా ఈ ఫోన్లను అభివృద్ధి చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ ప్లస్‌ త్వరరో మరో ఫ్లిప్‌ ఫోన్‌ను (OnePlus Flip) లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన టిప్‌స్టర్‌ ఈ వివరాలను వెల్లడించారు. టిప్‌ స్టర్ స్మార్ట్ పికాచు ఆధారంగా ఒప్పో సంస్థ ఫ్లిప్‌ ఫోన్ అభివృద్ధి చేస్తోంది. Find N5 Flip పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ టెలిఫోటో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

OnePlus Flip smartphone may launch with telephoto camera

అదే విధంగా వన్‌ప్లస్‌ ఫ్లిప్‌ ఫోన్‌ కూడా ఈ కెమెరా ఫీచర్లను కలిగి ఉండనుంది. ఎందుకంటే Find N5 Flip ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉంది. వన్‌ప్లస్‌ తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ ఒపెన్‌.. ఒప్పో ఫైండ్‌ N3 కి రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా విడుదల అయింది. అయితే ఈ ఫోన్‌లో టెలిఫోటో కెమెరా ద్వారా మెరుగైన జూమింగ్ సౌమర్థ్యం సహా పొర్ట్రెయిట్‌ అనుభూతి కూడా కలుగుతుంది.

విడుదల ఎప్పుడంటే?
అయితే ఈ వన్‌ ప్లస్‌, ఒప్పో ఫ్లిప్‌ స్మార్ట్‌ ఫోన్‌లు ఎప్పుడు లాంచ్‌ కానుందనే సమాచారం వెల్లడి కాలేదు. వన్‌ ప్లస్‌ సంస్థ ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. అయితే వన్‌ ప్లస్‌ ఓపెన్‌ తర్వాత తరం హ్యాండ్‌ సెట్‌ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు.

ఆపిల్‌ సంస్థ కూడా :
ఆపిల్‌ సంస్థ కూడా ఫోల్టబుల్‌ ఐఫోన్‌ను తయారుచేయనుందనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రోటోటైప్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ రెండు క్లామ్‌షెల్ మోడల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మోడల్‌ ప్రోటో టైప్‌లను అభివృద్ధి తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ Z Flip తరహా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సమాంతరంగా మడతపెట్టే విధంగా ఉంటుంది.

ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్లతోపాటు ఫోల్డబుల్‌ ఐప్యాడ్‌ను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ ఐప్యాడ్‌ ప్రస్తుతం ఉన్న ఐప్యాడ్‌ మిని తరహా 8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆపిల్‌ సంస్థ ఫోల్డబుల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌ విడుదలకు సంబంధించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
OnePlus Flip smartphone may launch with telephoto camera details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X