స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నయా రారాజు వన్‌ప్లస్

భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో టాప్‌లో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌, అమెరికా టెక్‌ దిగ్గజం ఆపిల్‌‌లను వెనక్కి నెట్టేసి టాప్‌ లీడర్ గా ఎదిగింది.

|

ప్రీమియం మార్కెట్లో దిగ్గజాలను వన్‌ప్లస్ వెనక్కి నెట్టేసింది. భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో టాప్‌లో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌, అమెరికా టెక్‌ దిగ్గజం ఆపిల్‌‌లను వెనక్కి నెట్టేసి టాప్‌ లీడర్ గా ఎదిగింది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజాగా వెల్లడించిన రిపోర్టులో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో శాంసంగ్‌, ఆపిల్‌ను మించిపోయి వన్‌ప్లస్‌ లీడ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. మొట్టమొదటిసారి వన్‌ప్లస్‌ కంపెనీ ఈ చోటును దక్కించుకున్నట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. 2018 రెండో క్వార్టర్‌లో 40 శాతం మార్కెట్‌ షేరుతో వన్‌ప్లస్‌ ఈ స్థానాన్ని సంపాదించుకుంది.

 

జియోపై తొడగొట్టిన షియోమి, అత్యంత తక్కువ ధరకే ఫీచర్ ఫోన్జియోపై తొడగొట్టిన షియోమి, అత్యంత తక్కువ ధరకే ఫీచర్ ఫోన్

వన్‌ప్లస్‌ 6 బలమైన అమ్మకాలే..

వన్‌ప్లస్‌ 6 బలమైన అమ్మకాలే..

ఈ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6 బలమైన అమ్మకాలే వన్‌ప్లస్‌ను టాప్‌ స్థానంలో నిలబెట్టడానికి దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వన్‌ప్లస్‌ 6 రికార్డు షిప్‌మెంట్లను నమోదు చేసినట్టు తెలిపింది. దిగ్గజ కంపెనీలైన ఆపిల్‌, శాంసంగ్‌ షిప్‌మెంట్లు ఏడాది ఏడాదికి కిందకి పడిపోయినట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడించింది.

మూడు కొత్త ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను..

మూడు కొత్త ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను..

ఇండియాలో కంపెనీ విజయవంతమైన నేపథ్యంలో మూడు కొత్త ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ప్రారంభించనుంది. బెంగళూరు, ముంబై, కోల్‌కతాలలో వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ప్రారంభించనున్నారు. బెంగుళూరులో జయానగర్ 4వ బ్లాక్‌లో, ముంబై సెంట్రల్ మాల్‌లో, కోల్‌కతా సౌత్ సిటీ మాల్‌లో ఈ స్టోర్స్ ప్రారంభమవుతాయి.

oneplus.in/retail-stores
 

oneplus.in/retail-stores

వీటి ప్రారంభం సందర్భంగా వన్‌ప్లస్ తన కస్టమర్లకు పలు ఆఫర్లను అందిస్తున్నది. oneplus.in/retail-stores అనే సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే సదరు స్టోర్స్‌లో ముందుగా వచ్చే 100 మంది కస్టమర్లకు వన్‌ప్లస్ 6ఎక్స్ మార్వెల్ అవెంజర్స్ ఐరన్ మ్యాన్ కేస్‌తోపాటు వన్‌ప్లస్ బ్రాండెడ్ టీషర్ట్‌లను ఉచితంగా అందిస్తుంది.

స్టోర్స్‌లో 91 శాతం సేల్స్

స్టోర్స్‌లో 91 శాతం సేల్స్

2017 జనవరిలో బెంగళూరులో వన్‌ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టోర్ ఓపెనింగ్ ద్వారా ఆ ప్రాంతంలో వన్‌ప్లస్ ఫోన్లు, యాక్ససరీలను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. ఇక గతంలో వచ్చిన వన్‌ప్లస్ 5తో పోలిస్తే వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు గాను స్టోర్స్‌లో 91 శాతం సేల్స్ పెరిగాయి. అందువల్లే దేశ వ్యాప్తంగా మరిన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ప్రారంభించాలని వన్‌ప్లస్ నిర్ణయం తీసుకుంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు..

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు..

ఇక ఈ ఏడాది జనవరిలో ముంబైలోని పార్లే వెస్ట్‌లో ఉన్న ప్రైమ్ మాల్‌లోనూ వన్ ప్లస్ తన ఆథరైజ్డ్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతోనే కొత్తగా మరిన్ని స్టోర్స్‌ను ఓపెన్ చేయడం జరుగుతుందని వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ తెలిపారు.

ఖరీదు ఎక్కువైనా ఫర్వాలేదు స్మార్ట్‌గా సెల్‌ఫోన్‌ని వాడదాం అనుకునేవారికి కొత్తగా దేశీయ మార్కెట్‌లోకి వచ్చిన ‘వన్‌ప్లస్‌ 5టీ' ప్రత్యేకమైంది. డ్యూయల్‌ కెమెరాలతో (20 మెగాపిక్సల్‌, 16మెగాపిక్సల్‌) ‘పోట్రెట్‌ మోడ్‌'లో కేవలం ముఖంపైనే ఫోకస్‌ చేస్తూ ఫొటో తీస్తే వెనకంతా బ్లర్‌ అయ్యి ముఖాన్ని మాత్రం స్పష్టంగా చిత్రీకరిస్తుంది.

4కే రిజల్యూషన్‌ క్వాలిటీతో ఫొటోలు

4కే రిజల్యూషన్‌ క్వాలిటీతో ఫొటోలు

4కే రిజల్యూషన్‌ క్వాలిటీతో ఫొటోలు చిత్రీకరించొచ్చు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్‌ కెమెరాలతో పాటు 6.01 అంగుళాలు. 18:9 కొత్త నిష్పత్తిలో పొడవైన తెరతో భిన్నంగా కనిపిస్తుంది.

రెండు ఆప్‌లను ఒకేసారి వాడుకోవడానికి

రెండు ఆప్‌లను ఒకేసారి వాడుకోవడానికి

స్ప్లిట్‌ స్క్రీన్‌ మోడ్‌లో రెండు ఆప్‌లను ఒకేసారి వాడుకోవడానికి పొడవైన తెర అనుకూలం. ఆండ్రాయిడ్‌ని వినూత్నమైన మార్పులు చేసి ‘ఆక్సిజన్‌ ఓఎస్‌'తో వినియోగదారులకు సరికొత్త సౌకర్యాల్ని పరిచయం చేస్తోంది.

6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ

6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ

రెండు మోడళ్లుగా ఫోన్‌ ఆన్‌లైన్‌ అంగళ్లలో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో ఒకటి. ధర రూ.32,999. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో మరోటి. దీని ధర రూ.37,999.

Best Mobiles in India

English summary
OnePlus: From a worthy competitor to an undisputed leader More News at GIzbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X