Home
Mobile

వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ విడుదల.. శక్తివంతమైన చిప్‌సెట్‌ సహా సూపర్‌ ఫీచర్లు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నుంచి త్వరలో వన్‌ప్లస్‌ 15 ఫోన్ (OnePlus 15 Smartphone) విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ తొలుత చైనాలో విడుదల కానుంది. అనంతరం భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానుంది. భారత్‌లో ఈ ఫోన్‌ శక్తివంతమైన చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. అయితే తాజాగా వన్‌ప్లస్‌ 15 భారత్‌ వేరియంట్ డిజైన్‌ వెల్లడయింది.

భారత్‌లో ఎప్పుడు విడుదల కానుంది :
భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ విడుదల గురించి సోషల్‌ మీడియా ద్వారా టీజింగ్‌ చేస్తోంది. అక్టోబర్ నెలలో చైనాలో ఈ ఫోన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే భారత్‌లో 2026 ప్రారంభంలో విడుదల అవుతుందని భావించారు.

Oneplus 15 smartphone design

అయితే తాజాగా అందుబాటులోకి వస్తున్న వివరాలు ఆధారంగా ఈ సంవత్సరం నవంబర్‌ లేదా డిసెంబర్‌ నెలల్లోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్‌ 13 ప్రస్తుతం అందుబాటులో ఉంది. 14 సిరీస్‌ను కాకుండా వన్‌ప్లస్ 15 పేరుతో ఫోన్‌లను లాంచ్ చేస్తుంది.

డిజైన్ విడుదల :
వన్‌ప్లస్‌ ఇండియా సీఈవో (OnePlus India CEO Robin Liu) రాబిన్‌ లియూ గోవాలో స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో వన్‌ప్లస్‌ 15 ఇండియా వేరియంట్‌ డిజైన్‌ను విడుదల చేశారు. ఈ ఫోన్‌ వైట్ ఫినిష్‌ను కలిగి ఉంది. శాండ్ డ్యూన్‌ కలర్ వేరియంట్‌గా పేర్కొంటున్నారు. ఈ ఫోటో ఆధారంగా వెనుక వైపు చతురస్రాకారంలో కెమెరా మాడ్యూల్‌ను గుర్తించవచ్చు.

ఇందులో మూడు కెమెరాలతోపాటు ఫ్లాష్‌ లైట్‌ను కూడా అమర్చి ఉంది. ఈ సంవత్సరం వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపాక్ట్‌ మోడల్‌గా వచ్చిన వన్‌ప్లస్ 13s తరహాలో కెమెరా మాడ్యూల్‌ డిజైన్‌ ఉంది. భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉండనుంది. ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి.

క్వాల్‌కాం లేటెస్ట్ చిప్‌సెట్ :
భారత్‌లో వన్‌ప్లస్ 15 హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం కొత్తగా లాంచ్‌ చేసిన స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్ 5 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ LPDDR5x ర్యామ్‌, USF 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గరిష్ఠంగా 16GB ర్యా్మ్‌, 1TB స్టోరేజీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా 5 స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గేమింగ్ సమయంలో ఆకట్టుకొనే పనితీరు కనబరిచేందుకు వీలుగా గేమింగ్‌ కోర్ 2.0 ను కూడా జతచేస్తుంది. లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ OS వెర్షన్ పైన లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల BOE X3 LIPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 1Hz-165Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్ సపోర్టును కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కెమెరా విభాగం పరంగా 50MP శాంసంగ్‌ JN5, 50MP వైడ్‌, 50MP టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ 120W వైర్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. చిప్‌సెట్ మినహా ఇతర స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus india CEO shows off Oneplus 15 smartphone design at snapdragon summit goa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X