వన్‌ప్లస్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెసిఫికేషన్లు. ఫీచర్లు, లాంచ్ తేదీ వివరాలు..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ నుంచి ఇటీవల నార్డ్ CE 4 హ్యాండ్ సెట్ విడుదల అయింది. అయితే తాజా వివరాల ప్రకారం వన్‌ప్లస్ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో విడుదల కానున్నాయని తెలుస్తోంది. టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ వివరాల ప్రకారం వచ్చే నెలలో విడుదల కానున్నాయని తెలుస్తోంది.
లీక్‌ల ఆధారంగా జూన్ నెలలో వన్ ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4 Smartphone) మరియు నార్డ్ CE 4 లైట్ (OnePlus Nord CE 4 Lite) ఫోన్‌లు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు గత మోడళ్లు కంటే మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. పూర్తి అంచనా వివరాలు మీ కోసం.

వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్... ఈ సంవత్సరం తొలిరోజుల్లో చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ Ace 3V హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్‌గా వస్తుందని తెలుస్తోంది. నార్డ్ 4 ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
అదే వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ హ్యాండ్ సెట్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 SoC పైన పనిచేస్తుందని సమాచారం మరియు OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Oxygen OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. 8GB ర్యామ్ తో 128GB, 256GB స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ నార్డ్ CE 4 లైట్ స్మార్ట్‌ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.20000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అదే నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ ధర రూ.25000 గా ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్లపై వన్‌ప్లస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








