Home
Mobile

భార‌త్‌లో OnePlus Nord 2T 5G ధ‌ర ఎంతంటే.. విడుద‌ల తేదీ ఖ‌రారైన‌ట్లేనా?

చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ OnePlus త్వ‌ర‌లో మ‌రో మొబైల్‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేయ‌నుంది. ఇప్ప‌టికే గ్లోబ‌ల్‌గా ఎంపిక చేసిన మార్కెట్ల‌లో లాంచ్ చేసిన ఈ OnePlus Nord 2T 5G మొబైల్స్ ను త్వ‌ర‌లో భార‌త మార్కెట్లో విడుద‌ల చేసేందుకు ఆ సంస్థ స‌న్నాహాలు ముమ్మ‌రం చేస్తోంది. జూన్ 27వ తేదీన OnePlus Nord 2T 5G దేశంలో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధిత టెక్ వ‌ర్గాల నుంచి ఈ కొత్త OnePlus Nord 2T 5G కి సంబంధించిన స్పెసిఫికేష‌న్స్, ఫీచ‌ర్ల స‌మాచారం లీక్ అయింది. కాబ‌ట్టి ఓ సారి వాటికి సంబంధించిన స్పెసిఫికేష‌న్‌ల‌పై ఓ లుక్ వేద్దాం. ఈ మొబైల్‌కు 50 మెగాపిక్సెల్ క్వాలిటీతో వ‌స్తున్న కెమెరా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలువనుంది.

OnePlus Nord 2T 5G స్పెసిఫికేష‌న్స్, ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి:

OnePlus Nord 2T 5G స్పెసిఫికేష‌న్స్, ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి:

OnePlus Nord 2T 5G మొబైల్ జూన్ 27న విడుద‌ల కానుంది. ఈ మొబైల్ కు 6.43 అంగుళాల AMOLD డిస్‌ప్లేను అందిస్తున్నారు. దీనికి 90Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ మొబైల్ ర్యామ్ సామ‌ర్థ్యం ఆధారంగా రెండు వేరియంట్ల‌లో రానుంది. వాటిలో 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో ఒక వేరియంట్ వ‌స్తుండ‌గా, 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో మ‌రో వేరియంట్ రానుంది. దీనికి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 778జీ ప్రాసెస‌ర్ అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌ని చేస్తుంది.

కెమెరా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌..

కెమెరా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌..

OnePlus Nord 2T 5G మొబైల్ కు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. 50 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో Sony IMX766 ప్ర‌ధాన కెమెరా, 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో Sony IMX355 sensor, మ‌రియు 2-మెగా పిక్సెల్ క్వాలిటీతో మోనోక్రోమ్ సెన్సార్‌ల‌ను క‌లిగి ఉంది. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

OnePlus Nord 2T 5G ధ‌ర (లీక్ స‌మాచారం):

OnePlus Nord 2T 5G ధ‌ర (లీక్ స‌మాచారం):

OnePlus Nord 2T 5G మొబైల్‌ 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ధ‌ర భార‌త్‌లో రూ.28,999 ఉండొచ్చ‌ని స‌మాచారం. OnePlus Nord 2T 5G మొబైల్ 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ధ‌ర భార‌త్‌లో రూ.31,999 ఉండొచ్చ‌ని టెక్‌ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ పై ప‌లు బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌పై రూ.4వేల క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ రావొచ్చ‌ని అంచ‌నా. జూలై 3 లేదా జూలై 5 వ తేదీ నుంచి వీటి అమ్మ‌కాలు ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మొబైల్స్ గ్రే షాడో, జేడ్ ఫాగ్ క‌ల‌ర్ల‌లో అందుబాటులోకి రానున్నాయి.

ఇప్ప‌టికే భార‌త్‌లో OnePlus Nord CE 2 5G అందుబాటులో ఉంది:

ఇప్ప‌టికే భార‌త్‌లో OnePlus Nord CE 2 5G అందుబాటులో ఉంది:

భార‌త్‌లో ఇప్ప‌టికే OnePlus Nord CE 2 5G మోడ‌ల్ మొబైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. 6GB RAM + 128GB|8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ల‌లో అందుబాటులో ఉంది. 64 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో, 8 మెగా పిక్సెల్, మ‌రియు 2-మెగా పిక్సెల్ క్వాలిటీతో ట్రిపుల్ కెమెరా సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. దీని ధ‌ర ప్ర‌స్తుతం రూ.23,999 కి వినియోగాదారుల‌కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
OnePlus Nord 2T 5G India Launch Tipped for June 27
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X