భార‌త మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే!

|

ప్ర‌ముఖ మొబైల్స్ త‌యారీ సంస్థ OnePlus నుంచి టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న OnePlus Nord 2T 5G ఫోన్ ఎట్ట‌కేల‌కు వ‌చ్చేసింది. భార‌త మార్కెట్లో OnePlus Nord 2T 5G మొబైల్‌ను ఆ కంపెనీ విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల‌ను క‌లిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో AMOLED డిస్‌ప్లే క‌లిగి ఉంది. అంతేకాకుండా ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌తో పాటుగా, 4,500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని క‌లిగి ఉంది. ఇది బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫ్లాగ్ షిప్ అనుభ‌వాన్ని ఇవ్వ‌గ‌ల ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

 
భార‌త మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే!

OnePlus Nord 2T 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.43 అంగుళాల full-HD+ (1,080x2,400 pixels) AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 20:9 aspect ratio తో 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. S octa-core MediaTek Dimensity 1300 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ కు హోల్ పంచ్ డిజైన్డ్ డిస్‌ప్లే అందిస్తున్నారు. డిస్‌ప్లే ప్రొటెక్ష‌న్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అందిస్తున్నారు. ఇది 8జీబీ ర్యామ్‌|128 జీబీ, 12జీబీ ర్యామ్‌|256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ OxygenOS 12.1 పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్‌తో మ‌రొక కెమెరా, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో షూట‌ర్ లెన్స్ తో మూడో కెమెరాను ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ Wi-Fi dual-band, Wi-Fi Direct, hotspot, బ్లూటూత్ వ‌ర్శ‌న్ 5.2 క‌లిగి ఉంది.

భార‌త మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే!

రెండు వేరియంట్ల‌లో:
భార‌త్‌లో ఈ మొబైల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. తొలి వేరియంట్ 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ప్రారంభ ధ‌ర రూ.28,999 వ‌ర‌కు నిర్ణ‌యించారు. మ‌రో వేరియంట్ 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ప్రారంభ ధ‌ర రూ.33,999 వ‌ర‌కు నిర్ణ‌యించారు. జులై 5 వ తేదీ నుంచి ఈ మొబైల్స్ కొనుగోలు కు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ మొబైల్స్ గ్రే షాడో, జేడ్ ఫాగ్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంటాయి. ఈ మొబైల్స్ కొన‌డానికి ఆస‌క్తి ఉన్న‌వారు అమెజాన్, వ‌న్ ప్ల‌స్ వెబ్‌సైట్‌, వ‌న్‌ప్ల‌స్ స్టోర్స్‌, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

 
భార‌త మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే!

ఇప్ప‌టికే భార‌త్‌లో అందుబాటులో ఉన్న‌ OnePlus Nord 2 5G:
ఈ మొబైల్ కు 6.43 అంగుళాల full-HD+ AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 20:9 aspect ratio తో 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. MediaTek Dimensity 1200-AI ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.డిస్‌ప్లే ప్రొటెక్ష‌న్ కోసం కార్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్‌తో మ‌రొక కెమెరా, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో షూట‌ర్ లెన్స్ తో మూడో కెమెరాను ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

భార‌త్‌లో ఈ మొబైల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా మూడు వేరియంట్ల‌లో విడుద‌లైంది. తొలి వేరియంట్ 6GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ప్రారంభ ధ‌ర రూ.27,999 వ‌ర‌కు నిర్ణ‌యించారు. మ‌రో వేరియంట్ 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ప్రారంభ ధ‌ర రూ.29,999 వ‌ర‌కు నిర్ణ‌యించారు. మ‌రో టాప్‌ వేరియంట్ 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ప్రారంభ ధ‌ర రూ.34,999 వ‌ర‌కు నిర్ణ‌యించారు.

Best Mobiles in India

English summary
OnePlus Nord 2T 5G With 80W Charging launched in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X