OnePlus Nord 2T Vs Poco F4 రెండింటిలో ఏది కొనాలో చూసుకొండిలా!

|

ఇటీవ‌ల మొబైల్ త‌యారీ కంపెనీలు వినియోగ‌దారుల ఆస‌క్తికి అనుగుణంగా అందుబాటు ధ‌ర‌ల్లో ఫ్లాగ్‌షిప్ అనుభ‌వాన్ని క‌లిగిన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవ‌ల Poco నుంచి Poco F4 5G స్మార్ట్ ఫోన్ విడుద‌ల కాగా, OnePlus నుంచి తాజాగా OnePlus Nord 2T 5G స్మార్ట్ ఫోన్ భార‌త మార్కెట్లో విడుద‌ల‌య్యాయి. ఈ రెండు మొబైల్స్ ఫ్లాగ్ షిప్ అనుభ‌వాన్నిచ్చేలా ఉన్న‌ప్ప‌టికీ అందుబాటు ధ‌ర‌లోనే ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ రూ.30వేల ప‌రిధిలోనే ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం మొబైల్ కొనాల‌నుకునే వారికి ఈ రెండింటిలో దేనిపై ఆస‌క్తి ఉందో తెలియ‌జేసేలా వాటి గురించి చ‌ర్చించుకుందాం.

Poco F4 5G వ‌ర్సెస్ OnePlus Nord 2T 5G :

Poco F4 5G వ‌ర్సెస్ OnePlus Nord 2T 5G :

డిజైన్ ప‌రంగా ఈ రెండు మొబైల్స్ పోలిస్తే.. OnePlus Nord 2T కేవలం కర్వ్‌డ్‌ డిజైన్‌తో నీట్‌గా మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. అయితే Poco F4 పెద్ద ఫోన్‌లా కనిపిస్తుంది. Poco F4 మొబైల్ OnePlus Nord 2T కంటే కొంచెం పెద్ద ఫోన్. అందువల్ల, ఇది వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. మీకు చిన్నగా, ప్రీమియం మాదిరి కనిపించే ఫోన్ కావాలంటే, OnePlus Nord 2T ఎంచుకోవ‌చ్చు. లేకపోతే, మీరు Poco F4ని ఎంచుకోవచ్చు.

OnePlus Nord 2Tతో పోల్చినప్పుడు Poco F4 పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉండటమే కాకుండా అధిక 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తుంది, అయితే OnePlus Nord 2Tలో రిఫ్రెష్ రేట్ 90Hz గా ఉంది. అందువల్ల, సోషల్ మీడియా యాప్‌లను బ్రౌజ్ చేయడం విష‌యంలో Poco F4 కంటే OnePlus Nord 2T కాస్త స్మూత్‌గా ఉంటుంది. Poco F4కి డాల్బీ విజన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇది పెద్ద స్క్రీన్ క‌లిగి ఉంది. మల్టీమీడియా వినియోగం మరియు గేమింగ్ విషయానికి వస్తే Poco F4 ఖచ్చితంగా OnePlus Nord 2T కంటే కాస్త బెట‌ర్‌గా ఉంటుంది.

 కెమెరాలు ఇలా ఉన్నాయి:

కెమెరాలు ఇలా ఉన్నాయి:

రెండు ఫోన్‌లు ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరాను కలిగి ఉన్నాయి. OnePlus Nord 2T మాత్రం 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇక‌, Poco F4లో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. హార్డ్‌వేర్‌లో భారీ వ్యత్యాసం కనిపించినప్పటికీ, వాస్తవ పనితీరు సమానంగా ఉంటుంది.

OnePlus Nord 2T సరికొత్త డైమెన్సిటీ 1300 SoCపై ఆధారపడి ప‌నిచేస్తుంది. అయితే Poco F4 Snapdragon 870 SoC పై ప‌నిచేస్తుంది. Geekbench 5 మరియు AnTuTu వంటి బెంచ్‌మార్క్‌ల ప్రకారం, Poco F4 స్పష్టంగా మరింత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. అదేవిధంగా, CPU థ్రోట్లింగ్ టెస్ట్‌లో కూడా, Poco F4 గరిష్ట పనితీరును ఎక్కువ కాలం కొనసాగించేలా ఉంటుందని తెలుస్తోంది.

Poco F4 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..

Poco F4 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..

ఈ మొబైల్ కు 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ను క‌లిగి ఉంది. ఇది 6GB/128GB, 8GB/128GB, 8GB/256GB, 12GB/256GB (RAM/Internal storage) వేరింయ‌ట్ల‌లో ల‌భిస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12ఓఎస్ (MIUI 13) పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. 64 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 20 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

మొబైల్స్ ధ‌ర‌లు:
భార‌త్‌లో Poco F4 5G ధ‌రల్ని వేరియంట్ల వారీగా (6GB + 128GB) రూ.23,999, (8GB + 128GB) రూ.25,999, (12GB + 256GB) రూ.29,999 గా నిర్ణ‌యించారు.

OnePlus Nord 2T 5G  ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

OnePlus Nord 2T 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ కు 6.43 అంగుళాల full-HD+ (1,080x2,400 pixels) AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 20:9 aspect ratio తో 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. S octa-core MediaTek Dimensity 1300 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ కు హోల్ పంచ్ డిజైన్డ్ డిస్‌ప్లే అందిస్తున్నారు. డిస్‌ప్లే ప్రొటెక్ష‌న్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అందిస్తున్నారు. ఇది 8జీబీ ర్యామ్‌|128 జీబీ, 12జీబీ ర్యామ్‌|256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ OxygenOS 12.1 పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్‌తో మ‌రొక కెమెరా, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో షూట‌ర్ లెన్స్ తో మూడో కెమెరాను ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ Wi-Fi dual-band, Wi-Fi Direct, hotspot, బ్లూటూత్ వ‌ర్శ‌న్ 5.2 క‌లిగి ఉంది.

రెండు వేరియంట్ల‌లో:
భార‌త్‌లో ఈ మొబైల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. తొలి వేరియంట్ 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ప్రారంభ ధ‌ర రూ.28,999 వ‌ర‌కు నిర్ణ‌యించారు. మ‌రో వేరియంట్ 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ప్రారంభ ధ‌ర రూ.33,999 వ‌ర‌కు నిర్ణ‌యించారు. జులై 5 వ తేదీ నుంచి ఈ మొబైల్స్ కొనుగోలు కు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ మొబైల్స్ గ్రే షాడో, జేడ్ ఫాగ్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంటాయి. ఈ మొబైల్స్ కొన‌డానికి ఆస‌క్తి ఉన్న‌వారు అమెజాన్, వ‌న్ ప్ల‌స్ వెబ్‌సైట్‌, వ‌న్‌ప్ల‌స్ స్టోర్స్‌, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
OnePlus Nord 2T Vs Poco F4: Which One Is Right For You?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X