ధర రూ.20,000 కంటే తక్కువ ధరకే వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్.. ఆఫర్ మిస్ కావొద్దు..!!
వన్‌ప్లస్ నుంచి గత సంవత్సరం వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ (OnePlus Nord 3 Smartphone) విడుదల అయింది. లాంచ్ సమయంలో ఈ హ్యాండ్ సెట్ ప్రారంభ ధర రూ.33,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరా సహా 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఈ హ్యాండ్ సెట్ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం డిస్కౌంట్ ఆఫర్‌తోపాటు కూపన్‌ల ద్వారా అదనంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.
ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ను అమెజాన్‌లో ప్రస్తుతం రూ.20999 కు కొనుగోలు చేయవచ్చు. కూపన్ ద్వారా రూ.1000 తగ్గింపుతో రూ.19999 కే సొంతం చేసుకోవచ్చు. అయితే వేరియంట్ల ఆధారంగా ధరలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ 3 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ నార్డ్ 3 5G ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 1450 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, HDR10 + ను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13.1 ఆధారిత Oxygen OS 13 ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 80W SuperVooc ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కెమెరాల విషయానికి వస్తే వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ సోనీ IMX355 కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు.
వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజీ మరియు 16GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. గత సంవత్సరం విడుదలైన ఈ హ్యాండ్ సెట్ ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. త్వరలో నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ భారత్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటి కప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








