Home
Mobile

ఈ OnePlus 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం.. ఏకంగా రూ.4000 డిస్కౌంట్‌!

వన్‌ప్లస్‌ గత సంవత్సరం జులైలో మిడ్‌ రేంజ్ ధరలో వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మా్ర్ట్‌ఫోన్‌ను (Oneplus Nord 4 Smartphone) లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ ను ప్రస్తుతం రూ.4,000 డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీ, 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాను కలిగి ఉంది. వన్‌ప్లస్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

వన్‌ప్లస్‌ వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం 256GB స్టోరేజీ వేరియంట్స్‌పై రూ.4000 తగ్గింపును అందిస్తోంది.

Oneplus nord 4 Smartphone latest news

లాంచ్ సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999 గా ఉండేది. ప్రస్తుతం రూ.28,999 గా ఉంది. ICICI, RBL, వన్‌కార్డ్‌ కార్డులపై రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.24,999 కే సొంతం చేసుకోవచ్చు.

విడుదల సమయంలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.35999 గా ఉండేది. ప్రస్తుత ధర రూ.31,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్‌లతో రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ వన్‌ప్లస్‌ 12GB ర్యామ్‌ వేరియంట్‌ను రూ.27,999 కే సొంతం చేసుకోవచ్చు. ఒయాసిస్ గ్రీన్‌, అబ్సిడియన్ మిడ్‌నైట్‌, మెర్య్కురియల్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది.

Oneplus nord 4 Smartphone latest news

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల (1240*2772 పిక్సల్స్‌) 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Adreno 732 GPU మరియు 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది.

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 ను కలిగి ఉంది. 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని వన్‌ప్లస్‌ తెలిపింది. 100W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 28 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ ఈ ఫోన్ ప్రత్యేకతని వన్‌ప్లస్‌ తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ల సపోర్టును కలిగి ఉంది. 5G, 4G LTE, Wifi 5.4, బ్లూటూత్ 5.4, GPS, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus nord 4 Smartphone gets RS 4000 discount on amazon and oneplus website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X