వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ ధర లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే విడుదలయ్యే ఛాన్స్.. జులై 16న లాంచ్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి జులై 16న భారత్ మార్కెట్‌లోకి వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ (Oneplus Nord 4 Smartphone) విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల గురించి అనేక లీక్‌లు వచ్చాయి. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర, బ్యాంకు ఆఫర్ల వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఆసక్తికరంగా వన్‌ప్లస్ నార్డ్ 3 కంటే తక్కువ ధరకే నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వస్తుందని ఈ లీక్ ఆధారంగా తెలుస్తోంది.
వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్ జులై 16న ఇటలీలోని మిలాన్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌లోనే మొత్తం నాలుగు ఉత్పత్తులను సంస్థ విడుదల చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్ 4 5G, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ వాచ్ 2R, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో ఈ సమ్మర్ ఈవెంట్‌లో లాంచ్ కానున్నాయి. వన్‌ప్లస్ ప్యాడ్ 2.. వన్‌ప్యాడ్ ప్రో ట్యాబ్లెట్‌కు రీబ్యాడ్జ్ వెర్షన్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

X (ట్విట్టర్) అకౌంట్ @TechHome100 ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.30999 లేదా రూ. 31,999 ఉండే అవకాశం ఉంది. అయితే బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.27,999 గా ఉంది. గత సంవత్సరం వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ రూ.33,999 కే అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు : వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ మెటల్ Unibody డిజైన్‌ను కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ టోన్ ఫినిష్‌తో అందుబాటులోకి రానుంది. గ్రే కలర్ వేరియంట్ డయాగ్నల్ లైన్ ప్యాట్రన్‌తో గ్రేడియంట్ ఫినిష్‌తో లాంచ్ కానుంది.
6.74 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లే..! :
దీంతోపాటు లీక్ అయిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను రానుంది. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 SOC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుకవైపు వన్‌ప్లస్ నార్డ్ 4 హ్యాండ్‌సెట్ 50MP ప్రధాన కెమెరా సహా 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ధరపై వన్‌ప్లస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








