Home
Mobile

6 సంవత్సరాలపాటు సెక్యూరిటీ, 4 OS అప్‌డేట్‌లతో వన్‌ప్లస్‌ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్.. లాంచ్ వివరాలు..!!

వన్‌ప్లస్‌ సంస్థ జులై 16న సమ్మర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్ 4 సహా వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2, వాచ్‌ 2R, నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో ఉత్పత్తులు లాంచ్‌ కానున్నాయి. ఈ అయితే ఇప్పటికే వన్‌ప్లస్‌ నార్డ్ 4 ఫోన్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. రెండు రోజుల క్రితం ధర వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే వన్‌ప్లస్‌ సంస్థ తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ మరియు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ల వివరాలను వెల్లడించింది. దీంతోపాటు పాత మోడల్‌ కంటే మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపింది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 (OnePlus Nord 4 Smartphone) గురించి సంస్థ కీలక వివరాలు వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్‌ నాలుగు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు మరియు 6 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని వన్‌ప్లస్‌ వెల్లడించింది. వన్‌ప్లస్‌ 12, గెలాక్సీ A55, గెలాక్సీ A35 స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఇదే తరహాలో OS అప్‌డేట్‌లను పొందనుంది.

oneplus announced that nord 4 will get 4 OS and 6 years of security updates

దీంతోపాటు మరో కీలకమైన విషయాన్ని కూడా వెల్లడించింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 హ్యాండ్‌సెట్‌తో పోలిస్తే ఎక్కువ మన్నిక వచ్చేలా నార్డ్‌ 4 ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. మరియు నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ మెటల్‌ Unibody డిజైన్‌ను కలిగి ఉంటుందని గతంలోనే వన్‌ప్లస్‌ వెల్లడించింది. మరియు డ్యూయల్‌ టోన్ ఫినిష్‌తో అందుబాటులోకి రానుంది. అయితే గ్రే కలర్‌ వేరియంట్‌ డయాగ్నల్‌ లైన్‌ ప్యాట్రన్‌తో గ్రేడియంట్ ఫినిష్‌తో లాంచ్ కానుంది.

రెండు రోజుల క్రితం ఈ హ్యాండ్‌సెట్ ధరను X (ట్విట్టర్‌) అకౌంట్ @TechHome100 అంచనా వేశారు. మరియు నార్డ్‌ 3 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీని ఆధారంగా నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.30999 లేదా రూ. 31,999 ఉండే అవకాశం ఉంది.

బ్యాంకు ఆఫర్లతో ఈ ధర రూ.27,999 గా ఉండే వీలుందని చెప్పారు. గత సంవత్సరం విడుదల అయిన వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ప్రారంభ ధర రూ.33,999 గా ఉంది. అయితే ఈ ధరపై వన్‌ ప్లస్‌ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 SOC చిప్‌సెట్‌ పైన పనిచేసే అవకాశం ఉంది. 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రధాన కెమెరా సహా 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
oneplus nord 4 smartphone will receive 4 OS and upto 6 years of security updates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X