భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందా.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, విడుదల తేదీ లీక్..!
వన్‌ప్లస్ నుంచి భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని గత కొన్ని నెలలుగా లీక్స్ వస్తున్నాయి. అయితే తాజాగా వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌ల గురించి కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో డిజైన్, లాంచ్ వివరాలు, చిప్‌సెట్ వంటి అనేక వివరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లు భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తాయని గతంలో లీక్స్ వచ్చాయి.
తాజాగా టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ X పోస్ట్ ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ 5 (OnePlus Nord 5), వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్లు జులై 8 వ తేదీన లాంచ్ కానున్నాయని చెప్పారు. అయితే ఈ తేదీన గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానున్నాయా లేదా భారత్ మార్కెట్‌లో లాంచ్ కానున్నాయా తెలియాల్సి ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ గురించి గతంలో అనేక లీక్ వచ్చాయి. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 1.5K రిజల్యూషన్ తో కూడిన ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6650mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాతోపాటు 16MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. గతంలో వచ్చిన లీక్స్ ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ రూ.30000 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 :
వన్‌ప్లస్ నార్డ్ CE 5 (OnePlus Nord CE 5 Smartphone) 6.7 అంగుళాల ఫ్లాడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
అయితే ఈ ఫోన్ ఏకంగా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7100mAh బ్యాటరీతో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఐకూ, వివో, రియల్‌మి, ఒప్పో వంటి సంస్థలు 7000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీతో ఫోన్‌లను విడుదల చేశాయి. త్వరలో వన్‌ప్లస్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 50MP సోనీ LYT 600 లేదా IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌లు విడుదల సహా డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరా, బ్యాటరీ వివరాలపై వన్‌ప్లస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ గురించి ఎప్పటి నుంచో అనేక లీక్స్ వస్తున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








