Home
Mobile

OnePlus Nord 5 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల విడుదల తేదీ వచ్చేసింది.. భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్ సహా..!

OnePlus Summer Launch Event 2026 : వన్‌ప్లస్‌ నుంచి త్వరలో నార్డ్‌ 5, నార్డ్‌ CE 5 ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మోడల్స్‌కు సంబంధించిన వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. గత వారంలో ఈ ఫోన్‌ల విడుదల తేదీ కూడా లీక్‌ అయింది. తాజాగా వన్‌ప్లస్‌ ఇండియా నుంచి తాజాగా కీలక ప్రకటన వచ్చింది. ఈ ఫోన్‌ల విడుదల తేదీ సహా కీలక వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్‌లతోపాటు బడ్స్‌ను కూడా విడుదల చేయనుంది.

వన్‌ప్లస్‌ ఇండియా తాజా ప్రకటన ఆధారంగా జులై 8 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వన్‌ప్లస్ నార్డ్ 5 (Oneplus Nord 5), వన్‌ప్లస్‌ నార్డ్ CE 5 (Oneplus Nord CE 5), వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 (Oneplus Buds) విడుదల కానున్నాయి. విడుదల తేదీతోపాటు కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను కూడా వన్‌ప్లస్‌ వెల్లడించింది.

Oneplus nord 5  nord ce 5 smartphones and buds 4 launch date revealed in india

చిప్‌సెట్‌ వివరాలు :
వన్‌ప్లస్‌ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 మొబైల్‌ ప్లాట్‌ఫాం చిప్‌సెట్ పైన పనిచేస్తాయి. ఈ చిప్‌సెట్‌ LPDDR5x ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ చిప్‌సెట్‌ మెరుగైన గేమింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది. మరియు BGMI 90fps ను సపోర్టు చేస్తుంది.

దీంతోపాటు వన్‌ప్లస్‌ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్.. 7300mm sq క్రయో వెలాసిటీ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ పరంగా మెరుగైన పనితీరును అందిస్తుంది. గేమింగ్‌ సహా ఇతర సమయాల్లో అన్ని విభాగాలు సక్రమంగా పనిచేసేలా చూస్తుంది.

తాజాగా వన్‌ప్లస్‌ నార్డ్‌ 5, వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. దీని ఆధారంగా కెమెరా మాడ్యూల్‌ డిజైన్‌ వెల్లడయింది. రెండు హ్యాండ్‌సెట్స్ పిల్‌ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉన్నాయి. ఇప్పటికే ఈ వన్‌ప్లస్‌ ఫోన్ల గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి.

వన్‌ప్లస్‌ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌ అంచనా వివరాలు :
వన్‌ప్లస్‌ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1.5K రిజల్యూషన్‌తో OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీ తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌ :
లీకైన్‌ వివరాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫ్లాట్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ 80W ఛార్జింగ్‌ సపోర్టుతో 7100mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్‌ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో రూ.30000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌ రూ.25000 ధర రేంజ్‌లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. త్వరలో అమెజాన్‌, వన్‌ప్లస్‌ ద్వారా మరిన్ని వివరాలు వెల్లడ‌య్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 :
ఈ బడ్స్‌ డ్యూయల్‌ డ్రైవర్స్‌, డ్యూయల్‌ DACs, Hi-Res LHDC 5.0, 3D ఆడియో వంటి ఫీచర్‌లను కలిగి ఉంటాయి. మరియు 47ms Low Latency ను అందిస్తుంది. ఈ బడ్స్‌ జెన్‌ గ్రీన్‌, స్టార్మ్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభించనున్నాయి. మొత్తంగా ఈ బడ్స్‌ మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తాయని వన్‌ప్లస్‌ చెబుతోంది.

Best Mobiles in India

English summary
Oneplus nord 5, nord ce 5 smartphones and buds 4 launch date revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X