ఇవాళే వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫోన్‌లు విడుదల కానున్నాయ్..!
OnePlus Summer Launch Event 2025 : వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE 5, వన్‌ప్లస్ బడ్స్ 4 విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్‌లు, బడ్స్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ 7100mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్ లాంచ్ ఈవెంట్‌ను సంస్థ అధికారిక యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ :
వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ LPDDR5x ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 7300 mm sq కైరో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. గేమింగ్ పరంగా 144fps ను సపోర్టు చేస్తుంది.

ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 50MP JN5 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా 60fps వద్ద 4K వీడియోను రికార్డు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ :
వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB LPDDR5x ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. 120 fps తో BGMI, CODM ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌లో మరొక ప్రత్యేకత ఉంది. ఏకంగా 7100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది.
ఈ ఛార్జర్‌తో కేవలం 59 నిమిషాల్లోనే 1-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని వన్‌ప్లస్ చెబుతోంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 6 గంటల వరకు యూట్యూబ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్ బ్యాటరీ హెల్త్ మేజిక్ ఫీచర్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP 1/1.95 అంగుళాల సోనీ LYT 600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు RAW HDR, రియల్ టోన్ టెక్నాలజీ, అల్ట్రా HDR వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.
వన్‌ప్లస్ బడ్స్ 4 :
వన్‌ప్లస్ బడ్స్ 4.. 11mm వూఫర్స్ మరియు 6mm ట్వీకర్స్, డ్యూయల్ DAC యూనిట్స్‌ను కలిగి ఉంటాయి. అమెజాన్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ TWS బడ్స్ LHDC 5.0 ఆడియో కోడిక్, 3D స్పేషియల్ ఆడియో అనుభూతిని అందిస్తుంది.
ఈ ఇయర్‌బడ్స్ Hi Res ఆడియో సర్టిఫికేషన్‌లను కలిగి ఉంటాయి. 55dB అడాప్టివ్ ANC ను సపోర్టు చేస్తాయి. ఈ బడ్స్ 3-మైక్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. AI ఆధారిత కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్టును కలిగి ఉంటుంది. గేమింగ్ మోడ్‌లో 47ms అల్ట్రా లో లేటెన్సీని కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ బడ్స్ 4 బడ్స్‌ను సింగిల్ ఛార్జింగ్‌తో 45 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. కేవలం బడ్స్ మాత్రమే 11 గంటల ప్లేబ్యాక్ టైంను అందిస్తాయి. ఈ వన్‌ప్లస్ బడ్స్ బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, స్టిడీ కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








