7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, శక్తివంతమైన చిప్‌సెట్‌తో వన్‌ప్లస్ ఫోన్..?
వన్‌ప్లస్ నుంచి భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే భారత్ మార్కెట్‌లో ఐకూ, వివో, ఒప్పో వంటి బ్రాండ్‌లు ఇప్పటికే భారీ బ్యాటరీలతో ఫోన్‌లను లాంచ్ చేశాయి. వన్‌ప్లస్ కూడా అదే దారిలో భారీ బ్యాటరీ ఫోన్‌ను లాంచ్ చేస్తుందని లీక్స్ వచ్చాయి. ఈ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 4 హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది.
తాజాగా వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ (Oneplus Nord 5 Smartphone) గురించి ఇప్పటికే కొన్ని వివరాలు లీక్ కాగా.. తాజాగా మరిన్ని వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ Debayan Roy వివరాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ రూ.30,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్ కంటే మెరుగైన పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.
ఈ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ప్లాస్టిక్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ను కలిగి ఉంటుందని సమాచారం. డిస్‌ప్లే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తోపాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఇటీవల వచ్చిన లీక్స్ ఆధారంగా వన్‌ప్లస్ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. గేమింగ్, హెవీ యూజర్లకు ఈ ఫోన్ సౌకర్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి, రెండు రోజుల వరకు వినియోగించుకోవచ్చు.
ఈ ఫోన్ మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా ఒప్పో K13 5G హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. వివో కూడా తన T4 5G మోడల్‌ను 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మూడు ఫోన్‌లు భారత్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.
ఈ భారీ బ్యాటరీ ఫోన్‌లు సుమారు రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. హెవీ యూజర్లకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. దీంతోపాటు భారీ డిస్‌ప్లేను కూడా కలిగి ఉన్నాయి. ప్రత్యేకంగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వినియోగించే వారికి కూడా సౌకర్యంగా ఉంటాయి. అయితే వన్‌ప్లస్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








