Home
Mobile

లేటెస్ట్‌ OnePlus స్మార్ట్‌ఫోన్‌ పై డిస్కౌంట్‌.. 50MP + 50MP కెమెరాలు, 6800mAh బ్యాటరీ సహా..!

వన్‌ప్లస్ ఈ సంవత్సరం జులై లో సమ్మర్‌ లాంచ్ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఇందులో వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ నార్డ్ 5, నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2025 సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ భారీ బ్యాటరీ, భారీ బ్యాటరీ, రెండు 50MP కెమెరాలను కలిగి ఉంది. వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, డిస్కౌంట్‌ ఆఫర్‌ వివరాలు.

రూ.1500 తగ్గింపు + ‌బ్యాంకు డిస్కౌంట్‌లు :
వన్‌ప్లస్‌ నార్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord 5 Smartphone) మార్బుల్‌ శాండ్స్‌, ఫాంటమ్‌ గ్రే, డ్రై ఐస్‌ మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.31999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ రూ.30499 గా ఉంది. అంటే రూ.1500 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

OnePlus Nord 5 Smartphone

12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.34,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.33,499 కే సొంతం చేసుకోవచ్చు. మరో వేరియంట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999 గా ఉండేది. ప్రస్తుతం రూ.36,499 గా ఉంది.

దీంతోపాటు SBI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే బేస్‌ వేరియంట్‌ పై కనిష్ఠంగా రూ.3 వేల డిస్కంట్‌ను పొందవచ్చు. దీంతో మొత్తంగా రూ.4500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇతర వేరియంట్స్‌పై సుమారుగా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

OnePlus Nord 5 Smartphone

భారీ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ :
వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ 6.83 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్లస్‌ కీ (Plus Key) తో అందుబాటులోకి వచ్చింది.

రెండు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో (OIS) ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 120 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP శాంసంగ్ ISOCELL JN5 కెమెరాతో అందుబాటులో ఉంది.

OnePlus Nord 5 Smartphone

6800mAh బ్యాటరీ :
ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6800mAh బ్యాటరీని కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 6, NFC, IR బ్లా్స్టర్‌, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord 5 Smartphone gets pricedrop on amazon great indian festival 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X