50MP + 50MP కెమెరాలు, 6800mAh బ్యాటరీ, 6.83 అంగుళాల చిప్‌సెట్‌తో OnePlus 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..!
OnePlus Summer launch Event 2025 : వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్ 2025 లో భాగంగా ఇవాళ వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE 5 మోడల్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5 5G ఫోన్ ప్రైమరీ, సెల్ఫీ కెమెరాలు 50MP గా ఉన్నాయి. మరియు 6800mAh బ్యాటరీని కలిగి ఉంది. మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మా్ర్ట్‌ఫోన్ ( OnePlus Nord 5 Smartphone ) 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ ఫోన్ 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.

ఆండ్రాయిడ్ 15 OS, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5x ర్యామ్, 512GB స్టోరేజీని తో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ ప్లస్ కీ ని కలిగి ఉంది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూ తో 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP శాంసంగ్ ISOCELL JN5 సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, IR బ్లాస్టర్ ను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999 గా ఉంది.
The all-new #OnePlusNord5 just dropped. Sale goes live on July 9th, 12 Noon IST for India. #UpYourGame pic.twitter.com/JdnyFEr00h
— OnePlus India (@OnePlus_IN) July 8, 2025
ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ జులై 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఇతర స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ మార్బుల్ శాండ్స్, ఫాంటమ్ గ్రే, డ్రై ఐస్ మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








