Home
Mobile

OnePlus Nord 5 : 50MP + 8MP + 50MP కెమెరాలతో వన్‌ప్లస్‌ నార్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌.. వచ్చే నెలలో విడుదల..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నుంచి ఈ నెల మొదటి వారంలో వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. కంపాక్ట్ డిజైన్‌తో ప్రీమియం ఫోన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. అయితే త్వరలో వన్‌ప్లస్ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో లాంచ్‌ కానున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ 5, వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 పేర్లతో విడుదల కానున్నాయి. జులై 8 వ తేదీన భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లతోపాటు వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 కూడా విడుదల కానున్నాయి.

వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల గురించి ఇప్పటికే కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా నార్డ్ 5, బడ్స్ 4 TWS బడ్స్‌కు సంబంధించిన కీలక వివరాలను వన్‌ప్లస్‌ వెల్లడించింది. ఇటీవల వన్‌ప్లస్ నార్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord 5 Smartphone) చిప్‌సెట్‌ వివరాలను వెల్లడించింది.

OnePlus Nord 5 smartphone

డ్యూయల్‌ కెమెరాలు :
తాజాగా ఈ ఫోన్‌ కెమెరా వివరాలను సంస్థ వెల్లడించింది. దీని ఆధారంగా ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 116 డిగ్రీల అల్ట్రావైడ్‌ యాంగిల్‌ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP శాంసంగ్‌ JN5 సెన్సార్‌ను కలిగి ఉంటుందని వన్‌ప్లస్ తెలిపింది.

స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ :
వన్‌ప్లస్‌ నార్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్ వెనుక, ముందు కెమెరాలు 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలిపింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ లైవ్‌ఫోటో ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఇటీవల విడుదల అయిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

OnePlus Nord 5 smartphone

ఈ చిప్‌సెట్ LPDDR5X ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు 7300 sq mm VC కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది. మరియు గేమింగ్‌ సమయంలో 144fps కలిగి ఉండనుంది. ఈ హ్యాండ్‌సెట్ డ్రై ఐస్‌, మార్బుల్‌ శాండ్స్‌, ఫాంటమ్ గ్రే కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్ 5 అంచనా వివరాలు :
వన్‌ప్లస్‌ నార్డ్ 5 హ్యాండ్‌సెట్ 6.83 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1272x2800 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరియు IP65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

Take a Poll

ఈ ఫోన్‌ చిప్‌సెట్‌ 8GB, 12GB ర్యామ్‌ మరియు 256GB, 512GB స్టోరేజీని సపోర్టు చేసే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్‌ 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు వన్‌ప్లస్‌ బడ్స్ 4 ANC వివరాలను కూడా వెల్లడించింది.

OnePlus Nord 5 smartphone

వన్‌ప్లస్‌ బడ్స్ 4 ANC బడ్స్‌ :
వన్‌ప్లస్‌ బడ్స్ 4 ANC బడ్స్‌ (OnePlus Buds 4) 3D ఆడియో, LHDC 5.0 ఆడియో కోడిక్‌ను సపోర్టు చేస్తాయి. గేమింగ్ మోడ్‌లో 47ms అల్ట్రా లో లేటెన్సీతోపాటు డ్యూయల్‌ DAC డ్రైవర్ యూనిట్స్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇయర్‌ఫోన్స్‌ 55dB అడాప్టివ్‌ యాక్టివ్‌ నాయిస్ క్యాన్సిలేషన్‌ (ANC) ఫీచర్‌ సపోర్టును కలిగి ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord 5 smartphone, OnePlus buds 4 specifications revealed ahead of launch on july 8 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X