Home
Mobile

వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ కీలక వివరాలు లీక్‌.. స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 చిప్‌, భారీ బ్యాటరీ సహా..?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లో గత నెలలో వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌పైన పనిచేస్తోంది. ప్రారంభ ధర రూ.47999 గా ఉంది. అయితే వన్‌ప్లస్‌ నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ రానుందని తెలుస్తోంది.

గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌ :
ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో వన్‌ప్లస్‌ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord 6 Smartphone) భారత్‌ సహా ‌గ్లోబల్‌ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే విడుదలపై సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే టిప్‌స్టర్‌ డెబయాన్‌ రాయ్‌ (Gadgetsdata) ఈ ఫోన్‌ ఇటీవలే గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌లో కనిపించినట్లు చెప్పారు.

Oneplus nord 6 Smartphone key specifications tipped ahead of expected launch soon

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్ :
ఈ లిస్టింగ్‌ ఆధారంగా వన్‌ప్లస్‌ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన నథింగ్‌ ఫోన్‌ 3 కూడా ఇదే చిప్‌ను కలిగి ఉంది. అయితే గీక్‌బెంచ్ లిస్టింగ్ ఆధారంగా సింగిల్‌ కోర్‌ టెస్ట్‌లో 2019 పాయింట్లు, మల్టీ కోర్‌ టెస్ట్‌లో 6503 పాయింట్లు పొందినట్లు తెలిసింది.

భారీ బ్యాటరీ :
ఈ లిస్టింగ్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు. అయితే 7000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ 9000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు.

ఆండ్రాయిడ్‌ 16 OS :
వన్‌ప్లస్‌ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిప్‌సెట్‌ 12GB LPDDR5x ర్యామ్‌, UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుందని సమాచారం.

ఎంత ధరలో లాంచ్‌ కానుంది? :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ రూ.35000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ :
గత నెలలో అందుబాటులోకి వచ్చిన వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7400mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 5 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ Adreno 8 సిరీస్‌ GPU, టచ్‌ రెస్పాన్స్ చిప్‌, G2 Wi-Fi చిప్‌ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOs 16 పైన పనిచేస్తోంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 50MP సోనీ IMX906 (OIS) ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus nord 6 Smartphone key specifications tipped ahead of expected launch soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X