Home
Mobile

వన్‌ప్లస్‌ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ నెల రోజులు ఆలస్యంగా విడుదల కానుందా?

OnePlus Nord 6 Smartphone : వన్‌ప్లస్‌ సంస్థ భారత్ మార్కెట్‌ లో గత సంవత్సరం నవంబర్‌ నెలలో వన్‌ప్లస్‌ 15, డిసెంబర్‌ నెలలో వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో వన్‌ప్లస్‌ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ కానుందని తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు లీక్‌ అయ్యాయి. దీంతోపాటు స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడయ్యాయి.

టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్‌ వన్‌ప్లస్‌ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ విడుదల గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఫోన్‌ మార్చి నెలలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని గతంలో లీక్స్‌ వచ్చాయి. అయితే ఈ ఫోన్‌ నెలరోజులు ఆలస్యంతో ఏప్రిల్‌ నెలలో అందుబాటులోకి వస్తుందని టిప్‌స్టర్‌ చెబుతున్నారు. అయితే వన్‌ప్లస్‌ మాత్రం విడుదలపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Oneplus nord 6 Smartphone launch timeline tipped here are the specifications

గీక్‌బెంచ్ లిస్టింగ్ :
నార్డ్‌ సిరీస్‌లో CE మోడల్స్‌ కూడా విడుదలయ్యేవి. అయితే నార్డ్‌ CE6 స్మార్ట్‌ఫోన్‌ విడుదల గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలోనే వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌లో కనిపించింది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్ :
ఈ లిస్టింగ్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇదే లిస్టింగ్‌ ఆధారంగా ఈ ఫోన్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు.

ఈ వన్‌ప్లస్‌ ఫోన్ 1.5K OLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై వన్‌ప్లస్‌ స్పందించలేదు.

* గత సంవత్సరం విడుదల అయిన వన్‌ప్లస్‌ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.36999, 12GB ర్యామ్ + 512GB ధర రూ.39999 గా ఉంది. ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.83 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్లస్‌ కీ ను కూడా కలిగి ఉంది. ఈ ఈ హ్యాండ్‌సెట్‌ 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6800mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700 ప్రైమరీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus nord 6 Smartphone launch timeline tipped here are the specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X