Home
Mobile

9000mAh భారీ బ్యాటరీ, 165Hz రీఫ్రెష్‌ రేట్‌, 50MP సోనీ కెమెరాలతో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌..?

భారత్ మార్కెట్లో వన్‌ప్లస్‌ నుంచి గత సంవత్సరం చివర్లో వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయ్యాయి. ఈ నెల 19 వ తేదీన వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్‌బడ్స్‌ లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ బడ్స్ వివరాలు వెల్లడయ్యాయి. నార్డ్ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. దీనిపై వన్‌ప్లస్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా.. టిప్‌స్టర్‌ నుంచి ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది :
టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్‌ వివరాల ఆధారంగా వన్‌ప్లస్‌ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ (Oneplus Nord 6 Smartphone) త్వరలో భారత్‌ లో విడుదల కానుందని తెలుస్తోంది. మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌ తొలి వారంలో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్‌ లోనే విడుదల అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉందని తెలిపారు.

Oneplus nord 6 smartphone

ఈ మోడల్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌! :
వన్‌ప్లస్‌ నార్డ్ 6 మాత్రమే విడుదల కానుందా.. CE 6 మోడల్ కూడా లాంచ్ అవుతుందా అనే వివరాలు వెల్లడి కాలేదు. ఇటీవల చైనా మార్కెట్‌ లో విడుదల అయిన వన్‌ప్లస్‌ టర్బో 6 హ్యాండ్‌సెట్‌ కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌ గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. గత వేరియంట్‌ తో పోలిస్తే అధిక ధరకు సేల్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఎంత ధర సెగ్మెంట్‌లో లాంచ్‌ కానుంది :
భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.34,999 గా ఉంటుందని టిప్‌స్టర్‌ చెబుతున్నారు. గత సంవత్సరం రూ.31,999 ప్రారంభ ధరకు వన్‌ప్లస్‌ నార్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌ :
టిప్‌స్టర్‌ తెలిపిన వివరాల ఆధారంగా ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌ 12GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. G1 ఇ-స్పోర్ట్స్‌ వైఫై చిప్‌ ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్‌ తెలిపారు. IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుందని తెలుస్తోంది.

165Hz రీఫ్రెష్‌ రేట్‌, 50MP కెమెరా :
ఈ నార్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.5K OLED ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ సెన్సర్‌ ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్‌ చెబుతున్నారు. అలాగే 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

భారీ బ్యాటరీ :
వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని ఎప్పటి నుంచో లీక్స్‌ వస్తున్నాయి. అయితే టిప్‌స్టర్‌ కూడా ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 9000mAh సిలికాన్‌ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వివరాలపై వన్‌ప్లస్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Oneplus nord 6 smartphone specifications launch timeline tipped in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X