Home
Mobile

వన్‌ప్లస్ నార్డ్ 6 vs శామ్‌సంగ్ S25 FE.. ఏది కొంటే మీ డబ్బులకు సరైన విలువ?

కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఆగస్టు 21న ఓ ఆసక్తికరమైన ధర్మసందేహం ఎదురవుతోంది. ఒకవైపు వన్‌ప్లస్ నార్డ్ 6 (OnePlus Nord 6) పై అదిరిపోయే డిస్కౌంట్లు నడుస్తుంటే, మరోవైపు ఆగస్టు 27న గెలాక్సీ ఈవెంట్‌ను శామ్‌సంగ్ టీజ్ చేసింది. ఇందులో గెలాక్సీ S26 FE లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ ఆఫర్లను వాడేసుకోవాలా లేక కొత్త మోడల్ లాంచ్ అయ్యే వరకు ఆగాలా అని ఆలోచిస్తున్న కొనుగోలుదారులకు ఈ టైమింగ్ చాలా కీలకం.

ఇక స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. శామ్‌సంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ Exynos 2400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఏకంగా 7 ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను శామ్‌సంగ్ హామీ ఇస్తోంది. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్ ఉంది. దీనికి 4 ఆండ్రాయిడ్ వర్షన్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు లభిస్తాయి. ఫోన్‌ను ఎక్కువ కాలం వాడాలన్నా, మంచి రీసేల్ వాల్యూ కావాలన్నా శామ్‌సంగ్ బెస్ట్ ఆప్షన్. అదే మిడ్-రేంజ్‌లో సూపర్‌ఫాస్ట్ స్పీడ్, పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి మాత్రం వన్‌ప్లస్ సూపర్ ఛాయిస్.

OnePlus Nord 6 vs Samsung Galaxy S25 FE: Which Phone Should You Buy in 2026?

భారత్‌లో ధరలు, బ్యాంక్ ఆఫర్లు: వన్‌ప్లస్ నార్డ్ 6 వర్సెస్ శామ్‌సంగ్ గెలాక్సీ S25 FE

శామ్‌సంగ్ S25 FE 8GB/256GB మోడల్ మార్కెట్ ధర సాధారణంగా ₹56,000 నుంచి ₹66,000 మధ్యలో ఉంటుంది. బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఇది మరింత తగ్గుతుంది. కొన్ని లిస్టింగ్‌లలో ఇది ఇప్పటికీ ₹59,999–₹65,999 మధ్య కనిపిస్తోంది. ఇక వన్‌ప్లస్ నార్డ్ 6 ధర ఇటీవల ₹44,499 వద్ద ఊగిసలాడుతోంది. దానికి తోడు ఈ నెల OnePlus.in లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌పై ₹2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ ఆఫర్లు లభిస్తున్నాయి. అయితే మీరు వాడే కార్డ్, కొనుగోలు చేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను బట్టి చివరి ధర మారవచ్చు.

కెమెరా, రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్: వన్‌ప్లస్ నార్డ్ 6 వర్సెస్ శామ్‌సంగ్ గెలాక్సీ S25 FE

కంటెంట్ క్రియేటర్లకు శామ్‌సంగ్ S25 FE బాగా నచ్చుతుంది. నేచురల్ స్కిన్ టోన్స్, ఆకట్టుకునే HDR, డేటైమ్ పోర్ట్రెయిట్స్ కోసం బెస్ట్ అనిపించే 3x టెలిఫోటో లెన్స్ ఇందులో ఉన్నాయి. నైట్‌టైమ్ ఫొటోగ్రఫీ కూడా పర్వాలేదనిపిస్తుంది. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ 6 తన కలర్ సైన్స్‌ను మరింత మెరుగుపరిచింది. ఇది కూడా సహజమైన స్కిన్ టోన్స్‌ను అందిస్తూ, మల్టీటాస్కింగ్‌లో చాలా వేగంగా పనిచేస్తుంది. అయితే అన్ని లెన్స్‌లలో ఒకే రకమైన కెమెరా క్వాలిటీ అందించే విషయంలో వన్‌ప్లస్ శామ్‌సంగ్ కంటే కాస్త వెనుకబడే ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్, గేమింగ్, డిస్‌ప్లే/PWM: వన్‌ప్లస్ నార్డ్ 6 వర్సెస్ శామ్‌సంగ్ గెలాక్సీ S25 FE

బ్యాటరీ లైఫ్ విషయంలో వన్‌ప్లస్ నార్డ్ 6 తిరుగులేదని చెప్పాలి. టెస్టింగ్‌లో ఈ ఫోన్ PCMark రన్‌లో ఏకంగా 20.8 గంటల బ్యాటరీ లైఫ్‌ను నమోదు చేసింది. కేవలం 1.1 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక శామ్‌సంగ్ S25 FE 45W ఛార్జింగ్‌తో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దాదాపు ఒక గంట సమయం పడుతుంది. కళ్ల రక్షణకు ఉపయోగపడే PWM ఫ్లిక్కర్ విషయానికొస్తే.. నార్డ్ 6 లో 90.6Hz ఫ్లిక్కర్ ఉండగా, శామ్‌సంగ్ S25 FE కళ్లకు మరింత హాయిగా ఉండే 480Hz రేట్‌ను ఉపయోగిస్తుంది.

నెట్‌వర్క్, SAR, అప్‌డేట్లు.. ఈ రోజు ఏ ఫోన్ కొంటే బెటర్?

జియో, ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ కోసం భారత్‌లో కీలకమైన n77/n78 బ్యాండ్లను ఈ రెండూ సపోర్ట్ చేస్తాయి. అయితే S25 FE అదనంగా n28 బ్యాండ్‌తో పాటు VoNR, VoWiFiలకు అధికారికంగా సపోర్ట్ ఇస్తోంది. ఇక SAR రేటింగ్స్ కూడా భారత్ పరిమితి అయిన 1.6W/kg లోపే ఉన్నాయి. S25 FE వ్యాల్యూ 1.04/1.03 W/kg గా ఉండగా, నార్డ్ 6 SAR వ్యాల్యూ 1.109 W/kg గా ఉంది. విద్యార్థులు, గేమర్లకు మంచి బ్యాటరీ లైఫ్ ఇచ్చే వన్‌ప్లస్ నార్డ్ 6 సరైన ఎంపిక. అలాగే బెస్ట్ కెమెరా, ఎక్కువ కాలం ఫోన్ వాడాలనుకునే వారికి శామ్‌సంగ్ S25 FE పర్ఫెక్ట్. ఒకవేళ ఏది తీసుకోవాలో ఇంకా తేల్చుకోలేకపోతే.. ఆగస్టు 27 వరకు ఆగడం మంచిది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X