Home
Mobile

అమెజాన్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

భారత్‌లో త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుండడంతో అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి. వన్‌ప్లస్‌ కూడా స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌ను ప్రకటించింది. తాజాగా వన్‌ప్లస్ నార్డ్‌ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ను (OnePlus Nord CE 3 5G Smartphone price drop) భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్‌ ఆఫర్‌లో భాగంగా ఏకంగా రూ.20,000 కంటే తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం విడుదల అయింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.26,999 గా ఉండేది.

ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలో అమెజాన్‌ (Amazon) వన్‌ప్లస్ నార్డ్‌ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.17999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. డిజైన్‌ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది.

OnePlus Nord CE 3 5G Smartphone

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉండేది. ధర తగ్గింపు అనంతరం అమెజాన్‌లో రూ.17,999 కే కొనుగోలు చేయవచ్చు. SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.1,250 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్‌ EMI, ఎక్స్చేంజీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్‌ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2412*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. HDR10+ సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 782G SoC చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. Adreno 642L GPU తో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OxygenOS 13.1 ను కలిగి ఉంది. ఈ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

50MP ప్రైమరీ, 16MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్‌ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX890 కెమెరా, 8MP IMX355 అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 16MP కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi, బ్లూటూత్‌ 5.2, GPS, A-GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్ లైట్‌ సెన్సార్‌, ఇ-కాంపాస్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, టంపరేచర్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 3 5G Smartphone gets massive discount on amazon specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X