Home
Mobile

108MP కెమెరా, 8GB ర్యామ్ OnePlus స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌.. స్పెసిఫికేషన్లు, అమెజాన్‌ సేల్‌ పూర్తి వివరాలు

వన్‌ప్లస్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి త్వరలో వన్‌ప్లస్ నార్డ్‌ CE 4 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఇటీవలే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌కు ముందు వెర్షన్‌ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ ను (OnePlus Nord CE 3 Lite) ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ సాధారణ ధర రూ,19,999 గా ఉండగా.. అమెజాన్‌ లో గరిష్ఠంగా రూ.2,500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.17,499 గా ఉంది. దీంతోపాటు HDFC బ్యాంకు కార్డుతో EMI లావాదేవీను నిర్వహించడం ద్వారా రూ.1,250 వరకు తగ్గింపును పొందవచ్చు.

OnePlus Nord CE 3 Lite Smartphone

IDFC ఫస్ట్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు కొనుగోలుపై (OnePlus Nord CE 3 Lite discount price on Amazon) ఇదే ఆఫర్‌ వర్తిస్తుంది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.16,150 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆఫర్‌ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ 5G స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌.. 6.72 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే నాణ్యమైన గొరెల్లా గ్లాస్‌ రక్షణను పొందుతుంది. ఈ డిస్‌ప్లే పంచ్‌ హోల్‌ డిజైన్‌ను పొందింది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రంట్‌ స్కానర్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ 5G హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 695 చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత Oxygen OS 13.1 ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 108MP ప్రధాన కెమెరా మరియు 2MP మ్యాక్రో, 2MP డెస్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాలను కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 5G, వైఫై, బ్లూటూత్‌ మరియు GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు సహా అనేక కనెక్టింగ్‌ ఫీచర్లను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 3 Lite Smartphone attracts with discount price on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X