Home
Mobile

6.7 అంగుళాల డిస్‌ప్లే, 8GB ర్యామ్ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 స్మార్ట్‌ఫోన్‌పై మరోసారి డిస్కౌంట్‌ ఆఫర్‌..!

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 స్మార్ట్‌ ఫోన్‌ (OnePlus Nord CE 3 Smartphone Price Drop) ధర మరోసారి తగ్గింది. ఇటీవలే వన్‌ ప్లస్ నుంచి నార్డ్‌ CE 4 హ్యాండ్‌ సెట్‌ ఇటీవల విడుదల అయింది. అయితే నార్డ్‌ CE 3 స్మార్ట్‌ ఫోన్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. విడుదల ధరతో పోలిస్తే ప్రస్తుతం ఈ ఫోన్‌పై గరిష్ఠంగా రూ.4,009 వరకు తగ్గింపును పొందవచ్చు.

రూ.2000 డిస్కౌంట్ :
విడుదల సమయంలో వన్‌ప్లస్‌ నార్డ్ CE 3 స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ ఈ వేరియంట్ రూ.22,990 గా ఉంది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.20,990 కే కొనుగోలు చేయవచ్చు.

OnePlus Nord CE 3 Smartphone

6.7 అంగుళాల డిస్‌ప్లే :
వన్‌ ప్లస్‌ నార్డ్‌ CE 5G స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ 13.1 ఆధారిత OSను కలిగి ఉంటుంది. మరియు 6.7 అంగుళాల పుల్‌ HD+ (1080*2412 పిక్సల్స్‌) ప్లూయిడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతోపాటు 120Hz రీప్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 782G చిప్‌సెట్‌తో అడెన్నో 642L GPU ప్రాసెసర్‌తో వస్తుంది.

80W సూపర్‌వోక్‌ ఛార్జింగ్ సపోర్టు :
ఈ స్మార్ట్‌ ఫోన్‌ 50MP కెమెరాతో 1/1.56 అంగుళాల సోనీ IMX890 సెన్సార్‌, OIS, EIS సపోర్టుతో వస్తుంది. దీంతోపాటు 8MP సోనీ IMX355 ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు 2MP 4cm మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ముందు వైపు 16MP ఫ్రంట్‌ కెమెరాతో వస్తుంది.

ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌ 256GB స్టోరేజీతో వస్తుంది. 80w సూపర్‌వోక్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సపోర్టుతో రానుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.2, NFC, GPS, A-GPS మరియు USB-C పోర్టుతో వస్తుంది.

దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఈ కంపాస్‌, IR- ప్లాస్టర్‌, గైరో స్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, మరియు టెంపరేచర్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌ లో తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 3 Smartphone gets best discount on amazon 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X