Home
Mobile

ధర రూ.18999 కే 8GB ర్యామ్‌, 5000mAh బ్యాటరీ OnePlus స్మార్ట్‌ఫోన్‌.. అమెజాన్ సేల్‌ పూర్తి వివరాలు..!

వన్‌ప్లస్‌ నుంచి ఇటీవల భారత్‌ మార్కెట్‌లోకి నార్డ్‌ CE 4 విడుదల అయింది. అయితే గత సంవత్సరం జులైలో లాంచ్‌ అయిన నార్డ్‌ CE 3 స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింది. అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024 లో (Amazon great Summer Sale 2024) భాగంగా భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord CE 3 Smartphone) 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను అమెజాన్‌ సేల్‌లో భాగంగా రూ.18,999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే గ్రే శిమ్మర్‌ (Grey Shimmer) కలర్‌ వేరియంట్ మాత్రమే ఈ ధరకు అందుబాటులో ఉంది. ఆక్వా సర్జ్‌ కలర్‌ వేరియంట్‌ హ్యాండ్‌సెట్ ధర రూ.21,499 గా ఉంది.

massive discount on OnePlus Nord CE 3 Smartphone

ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్‌ సేల్‌లో భాగంగా నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.17,400 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. అమెజాన్ సేల్‌ మే 2వ తేదీ నుంచి అందుబాటులో ఉండగా.. మే 7వ తేదీన ముగుస్తుంది.

6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లే :
వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ ప్లూయిడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1080*2412 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 80W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ 13.1 ఆధారిత OSను కలిగి ఉంటుంది. ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 782G చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ అడెన్నో 642L GPU తో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ గరిష్ఠంగా 256GB స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

నార్డ్‌ CE 5G స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX890 సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 8MP సోనీ IMX355 ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 16MP ఫ్రంట్‌ కెమెరాతో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.2, NFC, GPS, A-GPS మరియు USB-C పోర్టుతో వస్తుంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఈ కంపాస్‌, IR- ప్లాస్టర్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, మరియు టెంపరేచర్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు డిస్‌ప్లే ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 3 Smartphone gets huge discount on amazon Grear Summer sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X