వన్‌ప్లస్ నార్డ్ CE 4పై భారీ డిస్కౌంట్.. చీప్ ధరకే మీ సొంతం చేసుకోండి..!
OnePlus Nord CE 4: ఒక మంచి స్మార్ట్‌ఫోన్ రూ.20 వేల లోపు కొనాలని చూస్తున్నారా.. అయితే మీకు ఇది సూపర్ ఛాన్స్. వన్‌ప్లస్ నార్డ్ CE 4 (OnePlus Nord CE 4) ఇప్పుడు అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్‌తో లభిస్తోంది. నిజానికి ఈ ఫోన్ అసలు ధర రూ.24,999, కానీ ఇప్పుడు ఏకంగా రూ.3,000 ధర తగ్గించి, కేవలం రూ.21,999 కే లిస్ట్ చేశారు.
ఇంకా ఆఫర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ డీల్స్‌తో ధర మరింత తగ్గించుకోవచ్చు. మీ దగ్గర HDFC లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, ఇంకాస్త డిస్కౌంట్ వస్తుంది. అంతేకాదు, మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే, వన్‌ప్లస్ నార్డ్ CE 4ని మీరు కేవలం రూ.19,499కే సొంతం చేసుకోవచ్చు.

* సూపర్ డిజైన్, అదిరిపోయే డిస్‌ప్లే..
వన్‌ప్లస్ Nord CE 4 చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియమ్ లుక్‌తో వస్తుంది. ఇందులో 6.7-అంగుళాల Full హెచ్‌డీ + AMOLED డిస్‌ప్లే ఉంటుంది. రిజల్యూషన్ 1080×2412 పిక్సెల్స్. 20.1:9 యాస్పెక్ట్ రేషియో ఉండటం వల్ల స్క్రీన్ చాలా పొడవుగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని బ్రైట్‌నెస్ 1100 నిట్స్. అంటే ఎండలోనూ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది.
* ఫొటోలు, వీడియోలు ఇరగదీయొచ్చు..
మీరు ఫొటోలు, వీడియోలు తీయడానికి ఇష్టపడేవారైతే, ఈ ఫోన్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంది, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో వస్తుంది. ఈ OIS టెక్నాలజీతో ఫొటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లియర్‌గా, స్టెడీగా వస్తాయి.
వెనకాలే 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఇచ్చారు, దానితో విశాలమైన ఫొటోలు కూడా తీసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరా ఉంది. ఇది కూడా చాలా షార్ప్‌గా, డీటెయిల్డ్‌గా పిక్చర్స్ ఇస్తుంది. అంతేకాదు యూజర్ల బొమ్మను వీడియో కాల్స్‌లో చాలా క్లియర్ గా చూపిస్తుంది.
* పవర్ఫుల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్..
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లో మెయిన్ హైలైట్ దాని భారీ 5500mAh బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హాయిగా వాడుకోవచ్చు, మళ్లీ ఛార్జింగ్ పెట్టే పనిలేదు. ఇంకా ఇందులో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే కేవలం 29 నిమిషాల్లో 0 నుంచి 100% వరకు ఛార్జ్ అయిపోతుంది.
ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ ఏ ఫోన్‌లోనూ ఉండదు. ఫైనల్ ప్రైస్, ఆఫర్లు చూసుకుంటే అమెజాన్ ధర రూ.21,999 (డిస్కౌంట్ తర్వాత). బ్యాంక్ ఆఫర్ వన్‌కార్డు క్రెడిట్ కార్డ్‌తో రూ.2,000 వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్. అలాగే మంచి కండిషన్ లో ఉన్న ఓల్డ్ ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి ధర ఇంకా చాలా తగ్గించుకోవచ్చు.
అన్ని ఆఫర్లు కలిపితే, ధర రూ.19,499 వరకు తగ్గే అవకాశముంది. ఆసక్తి ఉన్నవారు అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనిని కొనేముందు ఒకసారి రివ్యూలు చూడాలి. అంతేకాకుండా ఇదే ధరలో వేరే మొబైల్స్ ఏమున్నాయో కూడా చూస్తే మంచిది తద్వారా బెస్ట్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.


Click it and Unblock the Notifications